ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : రేపటి సామూహిక దీక్షలో ఉద్యోగులు, కార్మికులు పాల్గొంటున్నామని జిల్లా ఐసిడిఎస్ డి డబ్ల్యు ఓ, డి ఎం హెచ్ ఓ లకు సిఐటియు వినతి పత్రం అందజేత.. నేటి దీక్షలో సిఐటియు అనుబంధ యూనియన్ల ఉద్యోగ కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి దుంపల రంజిత్ కుమార్ తెలిపారు. సీఐటీయు రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా మంగళవారం రసిఐటియు ఆధ్వర్యంలో బుధవారం సెప్టెంబర్ 16నమంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద సామూహిక నిరసన దీక్షలో జిల్లాలోని ఉద్యోగులు, కార్మికులు అందరు పాల్గొంటున్నామని తెలియచేస్తూ జిల్లా ఐసిడిఎస్ డి డబ్ల్యూ ఓ, డి ఎం హెచ్ ఓ లకు వినతి పత్రాలు అందజేశారు. ఈ సందర్బంగా సీఐటీయు జిల్లా కార్యదర్శి దుంపల రంజిత్ కుమార్ మాట్లాడుతూఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని గత రెండున్నర సంవత్సరాలుగా సిఐటియు ఆధ్వర్యంలో కార్మిక వర్గం పోరాడుతుంటే ఈ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ అరెస్టులతో, నిర్బంధంతో కార్మికులపై, పోరాడే సిఐటియు నాయకులపై అక్రమ కేసులు బనాయిస్తూ, కార్మికులను భయభ్రాంతులకు గురిచేస్తుం దన్నారు. శాంతియుతంగా హైదరాబాదు ఇందిరాపార్క్ వద్ద ధర్నా చేస్తుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం పోలీసులతో ధర్నా చేస్తున్న అంగన్వాడీలను, ఆశ వర్కర్లను మహిళలని చూడకుండా ఇష్టం వచ్చినట్లు రోడ్లమీద ఈడ్చుకెళ్లడం, ఈ సందర్బంగా దోమలగూడ సర్కిల్ ఇన్స్పెక్టర్ అంగన్వాడిలను ఆశ వర్కర్లనుమావోయిస్టులు, నక్సలైట్లు వచ్చారాంటూ దుష్ప్రచారం చేసిన సీఐ పై చర్యలు తీసుకోవాలి. కార్మికుల పోరాటం పట్ల రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న విధానాలు సరైంది కాదన్నారు. రేపు జరిగే జిల్లా కలెక్టరేటు ఎదుట జరిగే సామూహిక దీక్షలో జిల్లాలోని అంగన్వాడీలు ఆశ వర్కర్లు మధ్యాహ్న భోజన కార్మికులు ఐకెపి వివోఏలు మున్సిపాలిటీ, గ్రామపంచాయతీ , అన్ని రకాల హమాలీలు, హాస్టల్స్, హాస్పటల్స్ మెడికల్ కాలేజీ వర్కర్లు, సింగరేణి ఎంప్లాయిస్, సింగరేణి కాంటాక్ట్ కార్మికులు, బిల్డింగ్, ట్రాన్స్పోర్ట్ మరియు సంఘటిత అసంఘటిత రంగల ఉద్యోగ, కార్మికులు పాల్గొని జయప్రదం చేయాలన్నారు. ఈకార్యక్రమంలోఎస్. శోభ , వి.పద్మ, భీమయ్య నాయకులు పాల్గొన్నారు.
Admin
E Nivas News