Thursday, 30 July 2026 02:19:49 AM
# మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు

పోలీసు విధులపై ప్రత్యక్ష అవగాహన

విద్యార్థుల ను ఆకట్టుకున్న డాగ్ స్క్వాడ్ ప్రదర్శన

Date : 27 October 2025 07:01 PM Views : 282

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : సైబర్ నేరాల బారిన పడకుండా జాగ్రత్త ఉండాలి పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం (ఫ్లాగ్ డే) కార్యక్రమాల్లో భాగంగా సోమవారం రామగుండం పోలీస్ కమీషనరేట్ హెడ్ క్వార్టర్స్ లో పోలీస్ కమిషనర్ ముఖ్య అతిథిగా పాల్గొని మంచిర్యాల, పెద్దపల్లి డిసిపి భాస్కర్, కరుణాకర్ లతో కలిసి ఓపెన్ హౌస్ ప్రారంభించారు. విద్యార్థుల్లో చట్టపరమైన అవగాహన పెంచేందుకు గోదావరిఖని పట్టణంలో ని వివిధ కళాశాల, పాఠశాలల విద్యార్థినీ విద్యార్థులు దాదాపు 1000 మంది ఓపెన్ హౌస్ కార్యక్రమంలో పాల్గొన్నారు. విద్యార్థినీ విద్యార్థులకు ప్రజా రక్షణ, భద్రత సంబందించిన పోలీసు చట్టాల గురించి, పోలీసు విధులపై, షీ టీమ్స్, భరోసా సెంటర్స్ గురించి, కమ్యూనికేషన్ సిస్టం గురించి ఫింగర్ ప్రింట్ డివైస్ ల వల్ల కలిగే ఉపయోగాల గురించి, బీడీ టీమ్ ఎక్విప్మెంట్, డాగ్ స్క్వాడ్, ట్రాఫిక్ ఎక్విప్మెంట్, రోడ్డు ప్రమాదాలు స్పీడ్ లేజర్ గన్, ట్రాఫిక్ రూల్స్, ట్రాఫిక్ నిబంధనలు రోడ్డు నిబంధనల గురించి మరియు సైబర్ నేరాల గురించి పోలీసులు ఉపయోగిస్తున్న సాంకేతికత గురించి, షీటీమ్, భరోసా, గంజాయి ఇతర మత్తు పదార్థాలకు సంబంధించిన కిట్, తదితర స్టాల్స్ ఏర్పాటు చేసి సంబంధిత అధికారులు సిబ్బంది విద్యార్థులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ పోలీస్ అమరవీరుల త్యాగాల సంస్మరణ వారోత్సవాల లో భాగంగా రామగుండం పోలీస్ కమిషనర్లు పలు కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని దానిలో భాగంగా ఈరోజు కమిషనరేట్ హెడ్ క్వార్టర్ లో ఓపెన్ హౌస్ నిర్వహించడం జరిగిందని, పోలీసులు కేవలం నేరస్థులను పట్టుకోవడానికే కాదు, సమాజంలో శాంతి భద్రతలు, చట్టపరమైన అవగాహన పెంపు కోసం నిరంతరం కృషి చేస్తున్నారు. దానిలో భాగంగా ప్రతి విద్యార్థి పోలీస్ వ్యవస్థ ఎలా పనిచేస్తుందో, సమాజంలో భద్రత ఎలా సాధ్యమవుతుందో తెలుసుకోవాలని సూచించారు. దీనిలో విద్యార్థిని విద్యార్థులకు ప్రజల రక్షణ, భద్రత, మహిళ భద్రత, నేరాల నియంత్రణ నేరస్థుల పట్టుకోవడం కోసం పోలీసులు చేస్తున్న విధుల గురించి అవగాహనా కల్పించడం జరిగింది. అదేవిదంగా ప్రతి ఒక్కరూ రోడ్డు నిబంధనలు ట్రాఫిక్ నిబంధనలు పాటించి రోడ్డు ప్రమాదాలను అరికట్టాలని సైబర్ నేరాల వలలో పడకుండా తీసుకోవలసిన జాగ్రత్త చర్యల గురించి విద్యార్థినీ విద్యార్థులకు వివరించారు. సైబర్ నేరాలు సైబర్ మోసాలు ఎలా జరుగుతున్నాయో, సైబర్ నేరం జరగగానే 1930 టోల్ ఫ్రీ నెంబర్ ల గురించి విద్యార్థినీ విద్యార్థులకు అవగాహన కల్పించారు. పోలీసు చట్టాలు పోలీసులు ప్రజలకు అందిస్తున్న సేవలు గురించి విద్యార్థినీ విద్యార్థులకు అవగాహన కల్పించడం జరిగింది. ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా రాంగ్ రూట్లో వస్తే ఎలా ప్రమాదాలు జరుగుతున్నాయి హెల్మెట్ పెట్టుకోకపోతే ఎలా ప్రమాదాలు జరుగుతున్నాయి, తదితర అంశాల గురించి విద్యార్థిని విద్యార్థులకు అవగాహన కల్పించడం జరిగింది. మరియు బాలికలు మహిళల రక్షణకు ఏర్పాటుచేసిన భరోసా కేంద్రం యొక్క సేవల గురించి షీ టీమ్స్ పని తీరు, ఉండే వివిధ యాప్ ల గురించి అవగాహన కల్పించడం జరిగింది. గంజాయి డ్రగ్స్ ఇతర మత్తు పదార్థాల గురించి, డయల్ 100, గురించి కూడా అవగాహన కల్పించడం జరిగిందన్నారు. స్నిఫర్ డాగ్స్ తమ ప్రతిభతో ఆకట్టుకోగా, విద్యార్థులు ఆసక్తిగా వీక్షించారు. విద్యార్థుల్లో చట్టపరమైన అవగాహన పెంపు, పోలీస్ వ్యవస్థపై సానుకూల దృక్పథం కలిగించే లక్ష్యంతో కమీషనరేట్ పోలీస్ చేపట్టిన ఈ ఓపెన్ హౌస్ విద్యార్థులను ఉత్సాహపరిచింది. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ శ్రీనివాస్, ట్రాఫిక్ ఎసిపి శ్రీనివాస్, ఆర్ ఏ సి పి ప్రతాప్, సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, గోదావరిఖని 1 టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్ర సేనా రెడ్డి, రామగుండము సి ఐ ప్రవీణ్ కుమార్ , కమ్యూనికేషన్ ఇన్స్పెక్టర్ రాం ప్రసాద్, ఐటి కోర్ ఇన్స్పెక్టర్ చంద్ర శేఖర్ గౌడ్ , ఫింగర్ ప్రింట్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, ఆర్ ఐ లు దామోదర్ శ్రీనివాస్, వామన మూర్తి, శేఖర్, మల్లేశం, సంపత్,షీ టీమ్స్ ఎస్ ఐ లు , రామగుండం పోలీస్ కమీషనరేట్ పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షులు పోచలింగం, ఆర్ ఎస్ ఐ లు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :