ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం కొత్తపేట లో గతంలో మాదిరిగా ఆర్డినరీ సర్వీస్ లతో పాటు ఎక్సప్రెస్ బస్సులను ఆపాలని శనివారం రహదారిపై మహిళలు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ గతంలో ఫ్రీ బస్సు లేనప్పుడు అన్ని బస్సులు కొత్తపేట బస్ స్టాప్ వద్ద ఆపేవారని,ఫ్రీ బస్సు వచ్చాక అస్సలు బస్సులే ఆపడం లేదని మహిళా ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏజెన్సీ నుండి 12 గ్రామాల ప్రజలు గత సుమారుగా 40 ఏళ్ల నుంచి కొత్తపేట బస్టాండ్ నుండి వివిధ ఊర్లకు వెళ్లేవరని , ఇప్పుడు ఆపకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, గతిలేక ప్రవేట్ వాహనాల్లో అధిక డబ్బులు చెల్లించి ప్రైవేట్ వాహనాల్లో వెళ్ళవలసి వస్తుందని వారు వాపోయారు. మహిళలను చూస్తే ఖాళీగా వున్న బస్సు లు కూడా ఆపడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.గతంలో ఆగిన బస్సులు రెండేళ్ల నుండి ఎందుకు ఆగడం లేదని మహిళలు ప్రశ్నించారు. ఫ్రీ బస్సు లేకపోయి న పర్వాలేదు కొత్తపేట బస్టాండ్ వద్ద బస్సులు మాత్రం ఆపాలని ముక్తకంఠంతో మహిళ లు వేడుకుంటున్నారు.
Admin
E Nivas News