Sunday, 13 September 2026 12:55:52 AM
# శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్.. # కోతులను పారద్రోలడానికి కొండెంగ అవతారం ఎత్తిన ఉపసర్పంచ్ # కొండగట్టు బస్ ప్రమాద విషాదానికి నేటికి ఎనిమిదేళ్ళు... # అడవుల సంరక్షణలో అటవీ అధికారుల పాత్ర కీలకమైనది.. కలెక్టర్ కుమార్ దీపక్ # ఓటర్ల ధ్రువపత్రాల పరిశీలన వేగవంతంగా చేయాలి.. కలెక్టర్ కుమార్ దీపక్ # ఘనంగా పోలాల అమావాస్య’ వేడుకలు.. ఎద్దులను అందంగా అలంకరించి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు.. # పాఠశాలల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలి.. కలెక్టర్ యువరాజ్ మర్మత్.. # ఆత్మహత్యల నివారణ దినం పోస్టర్ ఆవిష్కరణలో జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి.గితే.. # పోలీస్–అటవీ శాఖల మధ్య మరింత సమన్వయంతో అటవీ సంపద, వన్యప్రాణుల రక్షణకు చర్యలు తీసుకుంటాం... ఎస్పి అశోక్ కుమార్.. # హియరింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలి... కలెక్టర్ కుమార్ దీపక్ # చిట్యాల ఐలమ్మ పోరాట స్ఫూర్తిని నేటి యువతరం ఆదర్శంగా తీసుకొని సమాజంలో ఆర్థిక అసమానతల నిర్మూలనకై కృషి చేయాలి

అమ్మన మడుగు ప్రాజెక్టుతో ఒక్క ఎకరానికి కూడా నీరందడం లేదు... ! నిధుల దుర్వినియోగంపై ప్రత్యేక విచారణ జరపాలని డిమాండ్...

తుడుం దెబ్బ జిల్లా అధ్యక్షుడు కోవ విజయకుమార్

Date : 07 July 2026 11:31 PM Views : 91

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : అమ్మనమడుగు ప్రాజెక్టుతో ఒక్క ఎకరానికి కూడా నీరందడం లేదని నిధుల దుర్వినియోగంపై విచారణ జలపాలని తుడుం దెబ్బ జిల్లా అధ్యక్షుడు కోవా విజయకుమార్ డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేరామెరి మండలం కేస్లాగూడలోని 'అమ్మన మడుగు ప్రాజెక్టు' ద్వారా ఒక్క ఎకరం వ్యవసాయ భూమికి కూడా సాగునీరు అందించడంలో గత ప్రభుత్వము, ప్రస్తుత ప్రభుత్వము పూర్తిగా విఫలమయ్యాయని తుడుందెబ్బ జిల్లా అధ్యక్షుడు కోవ విజయ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాజెక్టు వైఫల్యాలను, నిధుల అక్రమాలను ఎండగట్టారు. "దాదాపు 25 సంవత్సరాల క్రితమే 250 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో ఈ చెరువును (ప్రాజెక్టు) నిర్మించారు. కానీ, దీనికి దిగువన ఉన్న కేస్లాగూడ, కేరామెరి గ్రామస్థుల భూములకు నేటికీ ఒక్క ఎకరానికి కూడా సాగునీరు అందడం లేదు. గతంలోనూ ఈ ప్రాజెక్టుకు నిధులు ఇచ్చినట్లు ప్రకటించారు, కానీ ఆ నిధులు ఎటు పోయాయో, ఎవరు అక్రమాలకు పాల్పడ్డారో ఇప్పటికీ పత్తా లేదు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా రెండు నెలల క్రితమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ ప్రాజెక్టు రిపేర్ల నిమిత్తం రూ. 11.76 కోట్ల నిధులు మంజూరు చేసినట్లు తెలిపిందని గుర్తు చేశారు. కానీ, నేటి వరకు ఇక్కడ ఒక్క రూపాయి కూడా ఖర్చు చేసి అభివృద్ధి చేయలేదని, ఎలాంటి రిపేర్ పనులు చేపట్టలేదని మండిపడ్డారు. ప్రాజెక్టు కాలువలను కూడా అసంపూర్తిగా తవ్వించి అలానే వదిలేశారని, ఆ కాలువల వల్ల రైతులకు ఎలాంటి ఉపయోగం లేకుండా పోయిందని అన్నారు. ఇవన్నీ చూస్తుంటే కేవలం కాంట్రాక్టర్ల లబ్ధి కోసమే నిధులు మంజూరు చేసినట్లుగాఅనుమానాలు కలుగుతున్నాయని ఆరోపించారు.ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా అధికారులు తక్షణమే స్పందించి అమ్మన మడుగు ప్రాజెక్టును త్వరితగతిన అభివృద్ధి చేసి, రైతులకు సాగునీరు అందించాలి. ఈ ప్రాజెక్టు పేరుతో గతంలో మరియు ప్రస్తుతం మంజూరు చేసిన నిధులపై *ప్రత్యేక విచారణ జరిపించాలి. ప్రభుత్వం మరియు అధికారులు ఇప్పటికైనా నిద్ర మత్తు వీడి స్పందించకపోతే, కేస్లాగూడ గ్రామ పంచాయతీ, కేరామెరి గ్రామ పంచాయితీ పరిధిలోని ప్రజలందరినీ, రైతులను ఏకం చేసి భారీ ఎత్తున ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :