ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : మంథని బిసి బాలికల (ఎస్ఎంహెచ్) హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు ఆర్ల సందీప్ డిమాండ్ చేశారు. ఎస్ఎఫ్ఐ నాయకులు సోమవారం హాస్టల్ లోని సమస్యలు తెలుసుకుందామని వెళితే హాస్టల్ కి తాళం వేసి ఉందని, మంథనిలో వరుసగా హాస్టల్లో మూతపడడానికి కారణం హాస్టల్ వార్డెన్ లు, జిల్లా అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనబడుతుందన్నారు. మంథనిలో కాళాశాలలు, పాఠశాలలు నడుస్తున్న క్రమంలో హాస్టల్లు మూతపడి ఉండడం ఏమిటని, అడ్మిషన్లు అవుతున్న క్రమంలో హాస్టల్ లు తలుపులు వేసి తాళాలు ఉంటే అడ్మిషన్లు ఏ విధంగా జరుగుతాయని ప్రశ్నించారు. ఐటి శాఖ మంత్రి వెంటనే స్పందించి మంథని నియోజకవర్గ లో ఉన్న హాస్టల్లు, గురుకుల పాఠశాలలు, ప్రభుత్వ కాలేజీలు, పాఠశాలల సమస్యలపై సమీక్ష సమావేశం నిర్వహించి పరిష్కార దిశగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు బందెల రాజ్ కుమార్, అఖిల్, మహేందర్, కిరణ్, చరణ్ లు పాల్గొన్నారు.
Admin
E Nivas News