ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : ప్రభుత్వ పథకాల అమలులో అధికారులు వేగం పెంచి, నిర్దేశిత లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలని మంచిర్యాల జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి.చంద్రయ్య సూచించారు. మంగళవారంమంచిర్యాలజిల్లాలోని తాండూర్ మండలంలో కొనసాగుతున్న వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపురోగతిని పరిశీలించారు. మాదారం గ్రామపంచాయతీని సందర్శించి ఎస్‌ఐఆర్ నోటీసుల పంపిణీ ప్రక్రియను పరిశీలించి సిబ్బందితో ప్రక్రియ నిర్వహణ వివరాలు తెలుసుకుని, నోటీసుల పంపిణీ, విచారణకు సంబంధించిన పనులను నిబంధనల ప్రకారం పారదర్శకంగా నిర్వహిస్తూ ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయాన్ని సందర్శించి చేయూత పింఛన్లకు సంబంధించిన పనులు, వ్యక్తిగత మరుగుదొడ్లు తదితర కార్యక్రమాల పురోగతిని సమీక్షించారు. ఆయా పథకాల కింద చేపడుతున్న పనులు, పెండింగ్ అంశాలు, లబ్ధిదారులకు అందుతున్న సేవలపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. క్షేత్రస్థాయిలో పనులను వేగవంతం చేసి, అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. టెక్నికల్ అసిస్టెంట్లు తమ పరిధిలోని పనులపై ప్రత్యేక దృష్టి సారించి త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.మండలంలోని బోయపల్లి ప్రీ-ప్రైమరీ పాఠశాల, ప్రాథమిక ఉన్నత పాఠశాల లను సందర్శించి విద్యార్థులను పలు ప్రశ్నలు అడిగి వారి పఠన సామర్ధ్యాలను తెలుసుకున్నారు. బేస్‌లైన్ పరీక్షల ఫలితాలను పరిశీలించి, విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను బట్టి బోధనా విధానాలను రూపొందించాలని ఉపాధ్యాయులకు సూచించారు. వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించి ప్రత్యేక తరగతులు నిర్వహించాలని, విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన వాతావరణం, అవసరమైన మౌలిక వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. బోయపల్లి గ్రామపంచాయతీ కార్యాలయాన్ని సందర్శించి ఎస్‌ఐఆర్ విచారణ ప్రక్రియను పరిశీలించారు. విచారణకు హాజరైన వారి నుంచి వివరాలు తెలుసుకుని, ప్రతి అంశాన్ని నిబంధనల ప్రకారం పరిశీలించి పారదర్శకంగా నమోదు చేయాలని అధికారులకు సూచించారు. ప్రజలకు ఎటువంటిఇబ్బందులు కలగకుండా విచారణ ప్రక్రియనిర్వహించాలని తెలిపారు. ఈ పర్యటనలో తహసిల్దార్ జ్యోత్స్న, మండల పరిషత్ అభివృద్ధి అధికారి శ్రీనివాస్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News