Thursday, 30 July 2026 08:14:26 AM
# పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు

రైతుకు భరోసా ఇవ్వడమేప్రభుత్వ లక్ష్యం...

రైతులు అధైర్యపడవద్దు...

Date : 22 March 2026 10:48 PM Views : 110

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : తెలంగాణ రైతులకు రైతు భరోసా ఇవ్వడమే మా ప్రభుత్వ లక్ష్యమని రైతులు అధైర్య పడవద్దని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.సర్కార్ పంట పెట్టుబడి సాయంగా అందించే రైతుభరోసా నిధులను విడుదల చేశారు.3600 కోట్లను బటన్ నొక్కి రిలీజ్ చేశారు. సిద్దిపేట జిల్లా నర్మెటలో రూ.300 కోట్లతో నిర్మించిన ఆయిల్‌పామ్‌ ఫ్యాక్టరీని సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభా వేదికగా రైతు భరోసా నిధులను విడుదల చేశారు. ఈ పథకం కింద 1.50 కోట్ల ఎకరాలకు సాయం అందించేందుకు మూడు విడతల్లో రూ.9 వేల కోట్లను అకౌంట్లో జమ చేయనున్నారు . తెలంగాణలో మొత్తం 73 లక్షల మంది రైతులుండగావీరిలో తొలి విడతలో ఒక ఎకరం వరకు సాయం అందించనున్నారు.ఈ మేరకు రూ.3,590 కోట్లు ఆదివారం ఆర్బీఐ ద్వారా బ్యాంకులకు అటు నుంచి రైతులకు చేరతాయి. ఇవాళ ఆదివారం సెలవు దినం కావడంతో రేపు సోమవారం రైతుల ఖాతా ల్లో పెట్టుబడి సాయం డబ్బులు జమవుతాయి. ఆ తర్వాత ఇరవై రోజుల అనంతరం రెండో విడతలో రూ.2,650 కోట్లు, చివరి విడతగా రూ.2,760 కోట్లు విడుదల చేశారు. రాష్ట్రంలోని మొత్తం రైతుల్లో 24.32 లక్షల మందికి ఎకరం వరకు, 48.68 లక్షల మందికి ఎకరం కంటే ఎక్కువ వ్యవసాయ భూములు ఉన్నాయని అధికారులు వెల్లడించారు. రైతులకు మూడు విడతల్లో రైతు భరోసా నిధులు అందుతాయన్నారు. ప్రజా పాలనలో భాగంగా నర్మెటలో ఆయిల్‌పామ్‌ కర్మాగారం అందుబాటులోకి రానుండటంతో ఉత్తర, దక్షిణ తెలంగాణలోని 18 జిల్లాల రైతులకు మేలు జరగుతుందని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ పరిశ్రమలో రూ.80 కోట్లతో రిఫైనరీని సైతం నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించిందని అంటున్నారు. ఇది రెడీ అయితే స్థానికంగానే పామాయిల్‌ను ఉత్పత్తి చేయొచ్చునని చెబుతున్నారు. ఖమ్మం జిల్లా కల్లూరుగూడెం, కొణిజర్ల, ములుగు జిల్లా ఇంచర్ల, పెద్దపల్లి జిల్లా పెద్దరాత్‌పతి, వనపర్తి జిల్లా సంకిరెడ్డిపల్లి, గద్వాల జిల్లా బీచుపల్లిలో ఈ సంవత్సరాంతానికి మరో ఆరు కర్మాగారాలు అందుబాటులోకి వస్తాయని చెబుతున్నారు. రైతులు ఎంత పండించిన వాటన్నిటికీ మద్దతు ధరణి ఇచ్చి కొనుగోలు చేస్తామని తెలిపారు. రాష్ట్రంలో ఉన్న సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామన్నారు. అంతే కాకుండా రైతులకు ఎరువుల కొరత రాకుండా చూస్తామన్నారు. 2034లోగా మహిళలను కోటీశ్వరులు చేస్తామని తెలిపారు.

అలాగే కొడంగల్ లోను పామాయిల్ ఫ్యాక్టరీ నెలకొల్పుతామన్నారు. పంట మార్పిడి ద్వారానే సమస్యలు పరిష్కారం అవుతాయని తెలిపారు. రైతులు దీన్ని గమనించి ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు చూపాలన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు వివేక్ వెంకటస్వామి, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దామోదర రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యేలు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :