ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, కార్మికుల న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం టిజిఇ జెఏసి రాష్ట్ర కమిటీ ప్రకటించిన ఉద్యమ కార్యాచరణలో భాగంగా మంగళవారం మంథని యూనిట్ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన సమావేశం విజయవంతమైంది. ఈ కార్యక్రమానికి వివిధ ఉద్యోగ సంఘాల నాయకులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, కార్మిక సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉద్యమానికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ సందర్బంగా టిజిఇ జెఏసి పెద్దపల్లి జిల్లా చైర్మన్, జిల్లా అధ్యక్షులు బొంకూరి శంకర్ మాట్లాడుతూ ఉద్యోగుల హక్కుల పరిరక్షణ కోసం అన్ని సంఘాలు ఒకే వేదికపై ఐక్యంగా నిలవడం చారిత్రాత్మకమన్నారు. పిఆర్సి అమలు, పెండింగ్‌లో ఉన్న 6 డిఎలు విడుదల, సిపిఎస్ రద్దు చేసి ఓపిఎస్ పునరుద్ధరణ, హెల్త్ కార్డుల సమర్థ అమలు, పెండింగ్ బిల్లుల చెల్లింపు, ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు వంటి సమస్యలు వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆగస్టు 27న జిల్లా కేంద్రంలో జరిగే ధర్నాను విజయవంతం చేసి, సెప్టెంబర్ 1న పెన్షన్ విద్రోహ దినం, సెప్టెంబర్ 10న చలో హైదరాబాద్ మహా ధర్నాలో భారీ సంఖ్యలో పాల్గొనాలని , ఇది ఒక సంఘం ఉద్యమం కాదని, ప్రతి ఉద్యోగి, ఉపాధ్యాయుడు, పెన్షనర్, కార్మికుడి ఆత్మగౌరవ ఉద్యమమని పిలుపునిచ్చారు. టిజిఇ జెఏసి పెద్దపల్లి జిల్లా కన్వీనర్, టిజీఓ జిల్లా అధ్యక్షులు తూము రవీందర్ మాట్లాడుతూ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి న్యాయమైన హక్కులు సాధించుకునే వరకు ఉద్యమం కొనసాగుతుందని స్పష్టం చేశారు. మంథని డివిజన్ ఉద్యోగులు ఆగస్టు 27 జిల్లా ధర్నాకు భారీ సంఖ్యలో తరలివచ్చి ఐక్యతను చాటాలని కోరారు. ఈ సమావేశంలో పలు ఉద్యోగ సంఘాల నాయకులు మాట్లాడుతూ ఉద్యమ కార్యాచరణకు పూర్తి మద్దతు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లా టీఎన్జీఓ ల జిల్లా సంఘం కార్యదర్శి ఆయిరెడ్డి సందీప్ రెడ్డి, అసోసియేట్ అధ్యక్షురాలు గోపు అనిత, సౌమ్య, స్వప్న, ప్రవీణ్, శ్రీనివాస్ , టీజీఓ సంఘం కార్యదర్శి సురేష్, శ్రీనివాస్ , రవీంద్రనాథ్, సాజిద్, మంథని యూనిట్ టీఎన్జీఓ అధ్యక్షులు నూకల శంకర్, కార్యదర్శి పవన్, డీటీఎఫ్ జిల్లా కార్యదర్శి సంతోష్ రెడ్డి, పీఆర్టీయూ జిల్లా అధ్యక్షులు గండు కృష్ణమూర్తి , మంథని యూనిట్ ఉద్యోగులు, తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News