ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో అడ్మిషన్లు పెరిగేలా తగిన చర్యలు తీసుకోవాలని పెద్దపల్లి జిల్లా ఇంటర్ విద్యాధికారిణి కల్పన అన్నారు. గురువారం మంథనిలోని బాలికల, బాలుర కళాశాలలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కార్పొరేట్ స్థాయిలో కళాశాలలో సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. లక్షలాది రూపాయలు వెచ్చించి పనులను చేపడుతున్నామన్నారు. గత సంవత్సరంలో చేపట్టిన అడ్మిషన్ల కన్నా ఎక్కువగా అడ్మిషన్లు అయ్యేలా చూడాలన్నారు. అధ్యాపకులు విద్యార్థుల సంఖ్యను పెంచేలా విద్యార్థుల ఇళ్లకు వెళ్లి అవగాహన కల్పించాలన్నారు. విద్యార్థులు ఉంటేనే కళాశాలలు నిలబడతాయని, విద్యార్థుల సంఖ్య తగ్గకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. అనంతరం తరగతి గదిలో విద్యార్థుల నోట్ బుక్స్లను తనిఖీ చేశారు. కళాశాలలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాళ్ళు బాలోజీ, ఉషా అధ్యాపకులు ఉన్నారు.
Admin
E Nivas News