ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : బి ఆర్ ఎస్ ఎమ్మెల్యేలకు మహిళలంటే గౌరవం లేదని మంత్రి సీతక్క ఆరోపించారు. మంగళవారం శాసనసభలో బిఆర్ ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల తీరుపై పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క తీవ్రస్థాయిలో మండి పడ్డారు. స్పీకర్‌ను దూషించిన వారిని సభ నుంచి బహిష్కరించాలని మంత్రి సీతక్క శాసన మండలిలో డిమాండ్ చేశారు. మంగళవారం శాసన మండలి సమావేశా ల్లో ఆమె మాట్లాడా రు. మహిళా పోలీసు లపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి అసభ్యంగా చేతులు వేసి నెట్టి వేశారని మండిపడ్డారు. మహిళా కమిషన్ లో ఫిర్యాదు చేస్తామని తెలిపారు. మహిళా ఎమ్మెల్యేలపై పోలీ సులు దురుసుగా వ్యవహరిస్తేవిచా రణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు. గిరిజన, దళిత వ్యతిరేక నైజం మీది బీఆర్ఎస్‌దని మండిపడ్డారు. ఎస్సీ, ఎస్టీ, అణగారిన వర్గాలు ఎదిగితే ఓర్చుకోలేని భూస్వామ్య విధానం బీఆర్ఎస్‌దన్నారు. మహిళా ఎమ్మెల్యేల ను ముందు పెట్టి రాజకీయం ఎందుకు చేస్తున్నారని విమర్శించారు. మహిళా ఎమ్మెల్యేల పట్ల పోలీసులు అనుచితంగా ప్రవర్తిస్తే చర్యలు తీసుకుంటా మని స్పష్టం చేశారు. కేటీఆర్ మహిళా పోలీసులపై చేతులు వేశారు. ఎస్సీ, ఎస్టీ వ్యక్తులను దూషిస్తే యాక్ట్ వర్తిస్తుంది. వీల్లకు తల్లులు లేరా..? అహంకారంతో ఎలా తిడుతారు,వీళ్ల తల్లులను తిడితే వారు బాధ పడరా అన్నారు. 2018 లో స్పీకర్‌పై దాడి చేశారని నాటి కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై ఆర్టికల్ 194 (3) ప్రయోగించి సస్పెండ్ చేశారు. అదే రూల్ బీఆర్ఎస్ సభ్యులకు వర్తింప జెయ్యాలి. అసెంబ్లీ లో హరీష్ రావు స్పీకర్ పోడియం మీదకు ఉరుకుతు న్నారు. ఏంస్పీకర్ ను కొడుతరా, నిన్న దూషించారు. నేడు కొడుతారా? నైతిక విలువలు ఉండాలి. సభ సంప్రాదాలు ఉండాలి. ఇప్పటి వరకు స్పీకర్‌కు క్షమాపణ చెప్పలేదు. బీఆర్ఎస్ వైఖరిని తీవ్రంగా ఖండిస్తు న్నాం.” అని శాసన మండలిలో మంత్రి సీతక్క వ్యాఖ్యానిం చారు.
Admin
E Nivas News