ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : తెలంగాణలో కొత్త పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న వారికి రేవంత్ సర్కార్ శుభవార్త అందించింది. ఆగస్టు 15 నుంచి చేయూత పథకం కింద కొత్త పింఛన్లు అందించనుంది. వితంతువులు, ఒంటరి మహిళలు, నేత, గీత కార్మికులలో అర్హులైన వారందరికీ పింఛన్లు పంపిణీ చేయాలని ఇటీవల అధికారులను సీఎం రేవంత్ ఆదేశించారు. తలసేమియా, సికిల్ సెల్ ఎనిమియా బాధితులకు కూడా పింఛన్లుఅందించాలని, అర్హులను వెంటనే గుర్తించాలని సూచించారు. ఈ మేరకు తొలి దశలో సుమారు 2.5 లక్షల కొత్త పింఛన్లను మంజూరు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టినట్లు తెలిసింది.
Admin
E Nivas News