ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / మహబూబాబాద్ / మరిపెడ, ఉప్పుల రమేష్ : నూతనంగా ఏర్పడిన గ్రామ పంచాయతీలకు వెంటనే నిధులు విడుదల చేయాలని గ్రామ అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేయాలని, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6 గ్యారంటీలు ఇతర సంక్షేమ పథకాలను పేదలందరికీ దరిచేరే విధంగా అందించే విధంగా చూడాలని,సిపిఎం మండల కార్యదర్శి గుండగాని మధుసూదన్ అన్నారు. మరిపెడ మండలంలోని అబ్బాయిపాలెం గ్రామంలో సిపిఎం గ్రామ శాఖ సమావేశం నందిపాటి వెంకన్న అధ్యక్షతన జరిగింది. సమావేశానికి ముఖ్యఅతిథిగా మండల కార్యదర్శి గుండగాని మధుసూదన్, మండల ఆర్గనైజర్ బాణాల రాజయ్య, లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో వరస ఎన్నికలతో ప్రజాపాలన స్థబించి పోతుందని మున్సిపాలిటీ ఎన్నికలు కోడ్ పోకముందే మళ్లీ ఎంపిటిసి ఎన్నికలు ముందుకొస్తున్నట్లు తెలిపారు. దీంతో రైతులకు ఇవ్వాల్సిన బోనసు, మహిళలకు ఇవ్వాల్సిన 2500, ఆసరా పింఛన్లకు పెరగవలసిన పింఛన్లు ఆటంకంగా మారుతుయన్నారు. ఇది ఇలా ఉండగా ఇటీవల కాలంలో జరుగుతున్న ఎన్నికల్లో రాజకీయ ప్రాబల్యంతో డబ్బు మద్యం ఏరులై పారుతున్న ఎలక్షన్ అధికారులు వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యంగా వదిలేయడం వల్లనే విచ్చలవిడిగా ఓటర్లను కోటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే మరోపక్క చాప కింద నీరుల కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ చట్టాన్ని నూతన విద్యుత్ చట్టం, రైతు వ్యతిరేక చట్టాలు, కార్మికులకు ముప్పుగలుగే చట్టాలను తీసుకొస్తుందని వాపోయారు. ప్రజలు ఓట్లు డబ్బు మద్యం చుట్టూ తిరుగుతూ పాలకుల విధానాలను ఎండగట్టలేక పోతున్నారని అసహనం వ్యక్తం చేశారు.ఇప్పటికైనా ప్రజలను మభ్యపెట్టి ఓట్లు దండుకునే విధానానికి స్వస్తి పలకాలన్నారు. -వార్డు సభ్యురాలకు ఘన సన్మానం... డిసెంబర్ 17 న జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో భాగంగా అబ్బాయిపాలెం గ్రామపంచాయతీ నుండి సిపిఎం వార్డు సభ్యురాలుగా గెలిచిన నందిపాటి ఉప్పలమ్మ వెంకన్న లను సిపిఎం మండల నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి గుండగాని మధుసూదన్, నాయకులు బాణాల రాజయ్య, గ్రామ మాజీ ఉపసర్పంచ్ జిన్నా లచ్చయ్య, మాజీ వార్డ్ సభ్యురాలు జిన్నా మాధవి, కొండ ఉప్పలయ్య, ఎర్ర వెంకన్న, జినక జామ్మూర్తి, సైదులు, తదితరులు ఉన్నారు.
Admin
E Nivas News