Monday, 14 September 2026 06:36:33 AM
# మహిళల నాయకత్వాన్ని బలపరచండి... మాదిగ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు నందిని # నీటి సంఘం అధ్యక్షులు తిమ్మారెడ్డి కృషితో మద్దూరు కుంటకు కేసీ.కెనాల్ జలాలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ఆశీర్వదించండి...! ఆత్మకూరు సింగల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దిన్ # పాములపాడులో ఘనంగా కామ్రేడ్ సీతారాం ఏచూరి రెండవ వర్ధంతి # ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి పి ఆర్ టి యు నంద్యాల జిల్లా శాఖ ప్రాతినిధ్యం # కార్మికుడి ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు... సింగరేణి భద్రతా ప్రమాణాలపై ఎంపీ హెచ్చరిక... # ప్రముఖ కవి సుద్దాల అశోక్ తేజకు ప్రతిష్టాత్మక సాహిత్య పురస్కారానికి ఎంపిక.. # ఫ్రీ బస్సు వద్దని మహిళల రాస్తారోకో.. # ఆర్థిక ఇబ్బందులతో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు జగన్ ఆత్మహత్య... # దసరా నుంచి లబ్ధిదారులకుకొత్త పింఛన్లు పంపిణీ... # శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్..

తెలంగాణ కుంభమేళ మేడారం మహా జాతరకు ఏర్పాట్లు సర్వం సిద్ధం...

Date : 26 January 2026 08:53 AM Views : 272

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : ములుగు జిల్లా లో నిర్వహించేమేడారం మహా కుంభమేళ జాతరకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేస్తున్న ఏర్పాట్లు సర్వం సిద్ధం చేశారు.ఈనెల 28 నుంచి 31 వరకు సాగే మహా జాతరకు కోటి మంది భక్తులు తరలివస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. అందుకు తగ్గ ట్టుగా ప్రభుత్వం ఏర్పాటు చేసింది, పార్కింగ్ ప్రదేశా లు, ప్రయాణ ప్రాంగణాలు, వచ్చివెళ్లే మార్గాలలో ట్రాఫిక్ కనబద్దీకరణ దర్శనం సందర్భంలో రద్దీ నియంత్రణ భద్రత తదితర అంశాలకు ప్రాధాన్యమిచ్చి ప్రణాళికలు సిద్ధం చేసింది.. ఈ నేపథ్యంలోనే ఈ రాష్ట్ర పండగగా గుర్తింపు పొందిన మేడారం జాతరకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివెళ్తున్నారు. కొంతమంది నెలరోజుల ముందు నుంచే గద్దెల వద్ద మొక్కులు చెల్లిస్తున్నారు. భక్తులు తరలి వస్తారని అంచనాతో పోలీస్​ శాఖ దర్శనం సందర్భంలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేసింది, ఈ ఏడాది జాతర ఏర్పాట్లలో సాంకేతికతకు పెద్దపీట వేయడం గమనార్హం.జాతర విధుల్లో పోలీసు శాఖది కీలక పాత్ర ఉంది. ఈ జాతర ముగిసే వరకు 25 మంది ఐపీఎస్​ల పర్యవేక్షణలో 13 వేల మంది సిబ్బంది పని చేయనున్నారు. ఐజీ చంద్రశేఖర్​రెడ్డి ఆధ్వ ర్యంలో వరంగల్​ పోలీస్ కమిషనర్​ పర్యవేక్షణలో మేడారంలో రామగుండం సీపీ పర్యవేక్షణలో గద్దెలు, ట్రాఫిక్​ క్రమబద్ధీకరణ, జాతర కోర్​ ఏరియాలో భక్తుల రద్దీ నియంత్రణ విభాగాలు పని చేసేలా కసరత్తు చేశారు. అలాగే జాతరలో పాత నేరస్థుల సంచారం, తప్పిపోయిన వారి గుర్తింపు, దర్శన సందర్భంలో రద్దీ, ట్రాఫిక్ సమస్యలను గుర్తించేలా కృత్రిమ మేధతో సాంకేతి కతను ఉపయోగిస్తున్నారు. వీటన్నింటి కోసం 20 డ్రోన్​ కెమెరాలు, 450 సీసీ కెమెరాలను కమాండ్​ కంట్రో ల్​ రూంతో అనుసంధానించి నిఘా ఉంచుతున్నారు ఇక్కడ గతంలో ఏకకాలం లో అమ్మవార్ల గద్దెలను 2000 మంది దర్శించుకుం టే ప్రాంగణం రద్దీగా మారే ది. కాని ఇప్పుడు ప్రాంగణం విస్తరణతో ఒకేసారి 8-9 వేల మంది దర్శించుకునే సదుపాయం అందుబాటు లోకి వచ్చిందని అధికారు లు పేర్కొన్నారు. గతంలో సమ్మక్క-సారల మ్మ గద్దెల పక్కన పగిడిద్ద రాజు, గోవిందరాజుల గద్దెలుండేవి. భక్తులు ఆ ప్రాంగణం లోపల వెనక్కి ముందుకు తిరిగేవారు. పునర్నిర్మాణంతో గద్దెలన్నీ ఒకే వరుసలోకి రావడంతో ఆ సమస్య వస్తుందని చెబుతున్నారు. జాతరలో భక్తుల రద్దీ అనుగుణంగా ప్రైవేటు వాహనాలకు ఊరట్టం గ్రామం వద్ద 33 పార్కింగ్​ ప్రదేశాలు ఏర్పాటు చేశారు. అలాగే గద్దెలకు సమీపం లోనే ఆర్టీసీ బస్టాండ్​, వీఐపీ వావానాలకు పార్కింగ్​ సౌకర్యం ఉంటుంది. జాతర తేదీల్లో 3 లక్షల వాహనా లొచ్చినా నిలిపేందుకు సుమారుగా 2 వేల ఎకరాల స్థలాన్ని సిద్ధం చేశారు. గత సంవత్సరం కంటే ఈ సారి 500 బస్సులు పెంచను న్నారు. మహిళలకు ఆధార్​ గుర్తింపుతో ఉచిత ప్రయాణ సౌకర్యం కొనసాగుతుం ది.మొబైల్​ సిగ్నల్​ కోసం బీఎస్​ఎన్​ఎల్​ 10 తాత్కా లిక టవర్లను ఏర్పాటు చేసింది. మేడారం మహాజాతరకు చేరుకొనే మార్గంలో 39 చోట్ల రహదారులను అభి వృద్ధి చేశారు. అంతేకాదు తాడ్వాయి, పస్రా, బయ్యక్కపేట, మార్గాల్లో ఇరుకు రోడ్లను విస్తరించా రు. మేడారంలో సీసీ రోడ్లు, మురుగు కాలువలు నిర్మించారు. జంపన్న వాగు వద్ద ఆధునికీకరించారు.మేడారంలోని రెండు 33/11 కేవీ విద్యుత్తు ఉప కేంద్రాల సామర్థ్యాన్ని పెంచారు. నార్లాపూర్‌ వద్ద మరో 33/11 కేవీ సబ్‌ స్టేషన్‌ నిర్మించారు. విద్యుత్త్​ కోసం 259 ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పా టు చేశారు. జంపన్నవాగు పై నుంచి వెళ్లే లైన్ల కోసం ఎత్తయిన టవర్లను కూడా నిర్మించారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: