ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం గుడిరేవు గోదావరి తీరాన కొలువై ఉన్న శ్రీ పద్మాల్పురి కాకో అమ్మవారి దండారి ఉత్సవాల సందర్భంగా పోస్టర్ ను ఆలయ కమిటీ సభ్యులతో కలిసి బుధవారం జిసిసి చైర్మన్ కోట్నాక తిరుపతి విడుదల చేశారు. ఈ సందర్భంగా తిరుపతి మాట్లాడుతూ ఆదివాసుల ఆరాధ్య దైవం శ్రీ పద్మాల్పురి కాకో అమ్మవారి ఆలయం వద్ద జరిగే దండారి ఉత్సవాలలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని 17 న జరిగే దండారి దర్బార్ కార్యక్రమంలో అధికారులు ప్రజాప్రతినిధులు అధివాసులు, ఆదివాసేతరులు అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.
Admin
E Nivas News