Saturday, 12 September 2026 09:27:58 PM
# శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్.. # కోతులను పారద్రోలడానికి కొండెంగ అవతారం ఎత్తిన ఉపసర్పంచ్ # కొండగట్టు బస్ ప్రమాద విషాదానికి నేటికి ఎనిమిదేళ్ళు... # అడవుల సంరక్షణలో అటవీ అధికారుల పాత్ర కీలకమైనది.. కలెక్టర్ కుమార్ దీపక్ # ఓటర్ల ధ్రువపత్రాల పరిశీలన వేగవంతంగా చేయాలి.. కలెక్టర్ కుమార్ దీపక్ # ఘనంగా పోలాల అమావాస్య’ వేడుకలు.. ఎద్దులను అందంగా అలంకరించి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు.. # పాఠశాలల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలి.. కలెక్టర్ యువరాజ్ మర్మత్.. # ఆత్మహత్యల నివారణ దినం పోస్టర్ ఆవిష్కరణలో జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి.గితే.. # పోలీస్–అటవీ శాఖల మధ్య మరింత సమన్వయంతో అటవీ సంపద, వన్యప్రాణుల రక్షణకు చర్యలు తీసుకుంటాం... ఎస్పి అశోక్ కుమార్.. # హియరింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలి... కలెక్టర్ కుమార్ దీపక్ # చిట్యాల ఐలమ్మ పోరాట స్ఫూర్తిని నేటి యువతరం ఆదర్శంగా తీసుకొని సమాజంలో ఆర్థిక అసమానతల నిర్మూలనకై కృషి చేయాలి

సోనం వాంగ్చుక్ ప్రాణాలు కాపాడాలి..! నీట్ వైఫల్యంపై కేంద్ర విద్యా మంత్రి రాజీనామా చేయాలి...

మంచిర్యాలలో ప్రజాసంఘాల నిరసన ప్రదర్శన...

Date : 17 July 2026 08:23 AM Views : 98

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : దేశ రాజధాని లో 19 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న సోనం వాంగ్చుకుతో చర్చలు జరిపి కేంద్ర ప్రభుత్వం దీక్షనువిరమింపజేయాలని వివిధ ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో గురువారం అంబేద్కర్ విగ్రహం దగ్గర జరిగిన నిరసన ప్రదర్శనలో వివిధ ప్రజా సంఘాల కార్యకర్తలు పాల్గొన్నారు. కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వైఫల్యం కారణంగానే నీట్ పేపరు లీకయి 21 మంది అమాయక విద్యార్థులుఆత్మహత్య చేసుకున్నారని వారు ఆరోపించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో పాలకులు ప్రజలకుజవాబుదారీగా ఉండాలి కాని బాధ్యతలనుసక్రమంగా నిర్వహించని కేంద్ర మంత్రిని పదవి నుండి బర్తరఫ్ చేయాలని వారు డిమాండ్ చేశారు. 19 రోజులుగా సోనం వాంగ్చుక్అ నిరాహారదీక్ష చేస్తున్నా కేంద్ర ప్రభుత్వ పెద్దలు నిర్లక్ష్య ధోరణి వహించడం సరైనది కాదని వారు తెలిపారు. ప్రభుత్వం ప్రజలకుజవాబుదారీగా ఉండాలని, ఉద్యమకారులతో చర్చించి సమస్యల పరిష్కారానికి ముందుకు రావాలని వారు కోరారు. గతంలో లోక్ పాల్ బిల్లు కోసం అన్నా హజారే నిరసన దీక్ష చేపట్టినప్పుడు మన్మోహన్ సింగ్ ప్రభుత్వం దిగివచ్చి ఉద్యమకారుల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చిందని వారు గుర్తు చేశారు. నేటి కేంద్ర ప్రభుత్వ పెద్దలు మొండి వైఖరిని అవలంబించడాన్ని దేశ ప్రజలు నిరసిస్తున్నారని వారు తెలిపారు. దేశానికి విలువైన సేవలు అందించిన శాస్త్రవేత్తగా పర్యావరణవేత్తగా సోనం వాంగ్చుకు దేశ ప్రజలందరికీ ఆప్త బంధువుగా నిలిచాడని వారు పేర్కొన్నారు. సోనం వాంగ్చుకు ప్రాణాలు వెలకట్టలేనివని, తక్షణం ప్రభుత్వ పెద్దలు చర్చలకు సిద్ధం కావాలని వారు కోరారు. ప్రభుత్వ విధానాలపై నిరసన తెలుపుతున్న వారిని దేశద్రోహులని, విదేశీ ఏజెంట్లని నిందించడం మానుకోవాలని హితవు పలికారు. విద్యారంగంలో సమూల మార్పులు తీసుకురావడంతో పాటుయువతకు ఉపాధి కల్పించే దిశలో పాలకులు శ్రద్ధ తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పౌర స్పందన వేదిక కన్వీనర్ క్యాతం రవికుమార్, సామాజిక న్యాయ వేదిక కన్వీనర్ రంగు రాజేశం, బీసీ ఐక్య వేదిక జిల్లా అధ్యక్షులు కనుకుంట్ల మల్లయ్య, బీసీ మేధావుల ఫోరం జిల్లా చీఫ్ కోఆర్డినేటర్ శ్రీరామోజు కొండయ్య, తెలంగాణ జన సమితి నాయకులు ప్రదీప్, తెలంగాణ ప్రజా ఫ్రంట్ రాష్ట్ర నాయకులు జైపాల్ సింగ్, సామాజిక ఉద్యమకారులు డాక్టర్ చుంచు రాజ్ కిరణ్, మోతె రామదాసు, శ్రీమన్నారాయణ, బొజ్జ శరత్, సంకె రవి, గోగుల రవీందర్ రెడ్డి, రాధేశ్యాం, వేముల కిరణ్, షబ్బీర్ పాషా, కైలాసం, పడాల శ్రీనివాస్, మధు, జాగిరి రాజేష్, పూరెల్ల నితీష్, అంకం సాగర్, మెరుగు సతీష్, సమ్మయ్య, మహ్మద్ ఇబ్రహీం, కట్ట ప్రకాష్, మిడివెల్లి రాజ్ కుమార్, అడ్వాల లింగమూర్తి,రాజగోపాలాచారితదితరులుపాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :