ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : మంథని ప్రభుత్వ ఆసుపత్రిలో తెలంగాణ వైద్య విధాన పరిషత్ ద్వారా నూతన నియామకాలలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల, శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు ప్రత్యేక చొరవతో శుక్రవారం జనరల్ సర్జన్ డాక్టర్ నికీల్ తేజ విధుల్లో చేరారు. ఈ సందర్బంగా ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ టీవీ రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ మంథని పట్టణ, పరిసర మండలల ప్రజలు తరచుగా వచ్చే శస్త్రచికిత్స వ్యాధులు అపెండిసైటిస్, పిత్తాశయంలో రాళ్లు, పిత్తాశయం వాపు, ఇంగ్వైనల్ హెర్నియా, గజ్జల్లో హెర్నియా, బొడ్డు హెర్నియా, పొట్ట గోడ, ఇన్సిషనల్ హెర్నియా, పైల్స్ / మొలలు, ఫిషర్ / మలద్వారం చీలిక, ఫిస్టులా / భగందరం, మలద్వారం చుట్టూ చీము గడ్డ, పైలోనైడల్ సైనస్ హైడ్రోసీల్, రొమ్ములో గడ్డలు, రొమ్ములో చీము గడ్డ, లైపోమా / కొవ్వు గడ్డ, సెబేషియస్ సిస్ట్ / చర్మం కింద గడ్డ, శరీరంలో చీము గడ్డలు / అబ్సెస్, డయాబెటిక్ ఫుట్ పుండ్లు, పేగుల అడ్డంకి,పేగుకు రంధ్రం పడటం / పెరిటోనైటిస్ సంబంధించిన శాస్త్ర చికిత్సలను (లాప్రోస్కోపిక్ సర్జరీలను) మంథని ఏరియా ఆసుపత్రిలో ఒక్క రూపాయి ఖర్చు లేకుండా వైద్యం అందిస్తున్నామని తెలిపారు. కార్పోరేట్ ఆస్పత్రులకు ధీటుగా మంథని ప్రభుత్వ ఆసుపత్రిలో అందిస్తున్న వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Admin
E Nivas News