ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : శ్రీ రాజేంద్ర దాస్ మహారాజ్ బృందావన్ మాలూక్ పీఠాధిపతి ఆధ్వర్యంలో లోక కళ్యాణార్థం గోదావరి పరిక్రమ యాత్రను 500 మంది పీఠాధిపతులతో నాసిక్ లో నుండి ప్రారంభించారు. మన ప్రాంతంలోని మంచిర్యాల బీజాపూర్ చత్తీస్గడ్ మీదుగా భద్రాచలం చేరుకొని కొవ్వూరు మీదుగా ఆదివారం కాళేశ్వరం వద్ద బస చేశారు. సోమవారం త్రివేణి సంగమంలో స్నానాధి కార్యక్రమాలు ముగించుకుని కాళేశ్వరం ముక్తేశ్వర స్వామిని దర్శించుకుని మంథని మీదుగా ధర్మపురి వెళ్లే యాత్రలో భాగంగా ఈరోజు మంథనిలో విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో వారిని ఆహ్వానించి ఘనంగా సత్కరించడం జరిగింది. ఇందులో భాగంగా అయోధ్య వారణాసి తదితర పీఠాధిపతులకు పండ్లు అందించి వారి ఆశీర్వచనం తీసుకోవడం జరిగింది. పెద్ద ఎత్తున హిందూ బంధువులతో పాటు విశ్వహిందూ పరిషత్ పెద్దపల్లి జిల్లా ఉపాధ్యక్షులు కొత్త శ్రీనివాస్ ఆధ్వర్యంలో మంథని ప్రకండ ఉపాధ్యక్షులు రావుల సతీష్, బోట్ల ఆంజనేయులు, ప్రధాన కార్యదర్శి బత్తుల సత్యనారాయణల పర్యవేక్షణలో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గర్రెపల్లి వెంకటేశ్వర్లు, కెక్కెర్ల అనిల్, ప్రచారక్ తూర్పాటి రాము, సత్సంగ ప్రముక రాజమౌళి గౌడ్, కొమురవెల్లి హరీష్, గుండా శ్రీనివాస్, బొడ్డు వెంకటేష్, నూక శ్రీనివాస్, మాచిడి శ్రీధర్, కజ్జం శ్యామ్, కొమురవెల్లి సత్యనారాయణ, బొడ్డు సంపత్, విశ్వహిందూ పరిషత్ సభ్యులు మాతృశక్తి ప్రముఖ్ రావికంటి రేణుక, హిందూ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News