Tuesday, 15 September 2026 10:46:28 AM
# మహిళల నాయకత్వాన్ని బలపరచండి... మాదిగ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు నందిని # నీటి సంఘం అధ్యక్షులు తిమ్మారెడ్డి కృషితో మద్దూరు కుంటకు కేసీ.కెనాల్ జలాలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ఆశీర్వదించండి...! ఆత్మకూరు సింగల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దిన్ # పాములపాడులో ఘనంగా కామ్రేడ్ సీతారాం ఏచూరి రెండవ వర్ధంతి # ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి పి ఆర్ టి యు నంద్యాల జిల్లా శాఖ ప్రాతినిధ్యం # కార్మికుడి ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు... సింగరేణి భద్రతా ప్రమాణాలపై ఎంపీ హెచ్చరిక... # ప్రముఖ కవి సుద్దాల అశోక్ తేజకు ప్రతిష్టాత్మక సాహిత్య పురస్కారానికి ఎంపిక.. # ఫ్రీ బస్సు వద్దని మహిళల రాస్తారోకో.. # ఆర్థిక ఇబ్బందులతో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు జగన్ ఆత్మహత్య... # దసరా నుంచి లబ్ధిదారులకుకొత్త పింఛన్లు పంపిణీ... # శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్..

తెలంగాణ మహిళా కమిషన్ చైర్ పర్సన్‌గా గద్వాల విజయలక్ష్మి..

కమిషన్ సభ్యురాలుగా చాకలి ఐలమ్మ మనవరాలు నియామకం...

Date : 11 May 2026 09:17 PM Views : 125

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర మహిళా కమిషన్‌కు కొత్త నియామకాలు చేపట్టింది. మహిళా హక్కుల పరిరక్షణ, మహిళా సంక్షేమ కార్యక్రమాల పర్యవేక్షణ కోసం కీలకమైన తెలంగాణ మహిళా కమిషన్‌కు చైర్ పర్సన్‌గా గద్వాల విజయలక్ష్మిని నియమించింది. అలాగే కమిషన్ సభ్యులుగా ప్రభుత్వం పలువురు ప్రముఖ మహిళలకు అవకాశం కల్పించింది. ఈ నియామకాల్లో తెలంగాణ ఉద్యమం, సామాజిక సేవ, మహిళా హక్కుల ఉద్యమాల్లో పనిచేసిన వారికి ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలుస్తోంది. తెలంగాణ ఉద్యమంలో అమరుడైన శ్రీకాంతచారి తల్లి కాసోజు శంకరమ్మను మహిళా కమిషన్ సభ్యురాలిగా రేవంత్‌రెడ్డి సర్కార్ నియమించింది. తెలంగాణ ఉద్యమ సమయంలో శ్రీకాంతచారి త్యాగం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. ఈ నియామకంతో తెలంగాణ ఉద్యమ కుటుంబాలకు ప్రభుత్వం గౌరవంఇచ్చినట్లయిందని పలువురు అభిప్రాయపడుతున్నారు.తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ మనవరాలు చిట్యాల శ్వేతను కూడా కమిషన్ సభ్యురాలిగా కాంగ్రెస్ సర్కార్ నియమించింది. చాకలి ఐలమ్మ తెలంగాణ రైతాంగ పోరాట చరిత్రలో కీలక వ్యక్తిగా గుర్తింపు పొందారు. ఆమె కుటుంబానికి ఈ నియామకంతో ప్రాధాన్యం సంతరించుకుంది. +మరికొంత మందికి సభ్యులుగా అవకాశం* మహిళా కమిషన్ సభ్యులుగా శశికళ యాదవ్ రెడ్డి, సదాలక్ష్మి, రాధాభాయి, ఉజ్మా షకీరాలను కూడా తెలంగాణ ప్రభుత్వం నియమించింది. వివిధ సామాజిక వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించేలా ఈ నియామకాలు చేపట్టినట్లు తెలిసింది. ప్రభుత్వం మహిళా సాధికారతకు ప్రాధాన్యం ఇస్తోందని, మహిళల సమస్యల పరిష్కారంలో కమిషన్ కీలక పాత్ర పోషిస్తుందని ప్రభుత్వ అధికారులు భావిస్తున్నారు. తెలంగాణ మహిళా కమిషన్ మహిళలపై జరిగే అన్యాయాలు, వేధింపులు, వివక్ష అంశాలపై చర్యలు తీసుకునే కీలక సంస్థగా పనిచేస్తుంది. కొత్త కమిషన్ మహిళా భద్రత, మహిళా హక్కులు, సంక్షేమ పథకాల అమలుపై ప్రత్యేక దృష్టి పెట్టే అవకాశం ఉంది. ఈ నియామకాల్లో తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన కుటుంబాలకు అవకాశం కల్పించడం విశేషంగా మారింది. శ్రీకాంతచారి కుటుంబం, చాకలి ఐలమ్మ వారసులకు ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా ఉద్యమ చరిత్రను గుర్తు చేసిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: