Thursday, 30 July 2026 12:26:50 AM
# మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు

గద్దె మీద కొలువైన పగిడిగిద్ద రాజు, గోవిందరాజు, సారలమ్మ..! మేడారం చేరుకున్న లక్షలాదిమంది భక్తులు

దారులు అన్ని మేడారం మహా జాతర వైపే...

Date : 29 January 2026 12:29 AM Views : 185

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : వనదేవతల దర్శనం ఎప్పుడు అని ఎదురుచూసిన ఆ భక్తుల కల బుధవారంతో నెరవేరింది. ముందుగా పగటిగిద్దరాజు గోవిందరాజులు గద్దలపై కొలువుగాక రాత్రి 9:30 గంటల ప్రాంతంలో కన్నెపల్లి నుండి సార్లమును కోయ పూజారులు ఒక బుట్టలో ఎంతో భక్తిశ్రద్ధలతో తీసుకువచ్చి గద్దెపై కొలుపు తీర్చారు. దీంతో వనదేవతల మహా కుంభమేళా జాతర ప్రారంభమైంది. ఇప్పటికే మేడారంకు లక్షలాది మంది భక్తులు వనదేవతల దర్శనం కోసం చేరుకున్నారు. భక్తులు ఎడ్లబండ్లలో, భారీ సంఖ్యలో బండి వెనక బండి గట్టీ అని వస్తున్నారు. అంతేకాకుండా సొంత వాహనాలను యజమానులు భారీగా తల్లి రావడంతో రహదారులన్నీ మేడారం వైపే కొనసాగుతున్నాయి. మేడారం పూర్తిగా జనసంద్రంగా మారింది. వచ్చిన భక్తులు గుడారాలు వేసుకొని మూడు రోజులపాటు ఉండి తిరుగు ప్రయాణం అవుతారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తాత్కాలిక మరదలు మరుగుదొడ్లు నీటి సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు. దర్శనం కి వెళ్లే భక్తులకు క్యూలైన్లో నీటి సౌకర్యాన్ని కల్పించారు. గద్దల వద్ద పదివేల మంది భక్తులకు ఒకసారి దర్శనం కల్పించుకునే కల్పించారు. విఐపి దర్శనాలకు ప్రత్యేక లైన్లు ఏర్పాటు చేశారు. ఆర్టీసీ అధికారులు జాతర కోసం 4,000 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. ఈనెల 20వ తారీకు వరకు బస్సులు నడపనున్నారు. సార్ల మనం తీసుకువచ్చే సమయంలో 300 మంది రోప్పార్టీ పోలీసులు భద్రతగా ఉంటారు. ఇసుకేస్తే రాలనంత జనం కూడా రావడం జరిగింది. భక్తులను గద్దలలోకి అనుమతి లేదు భక్తులంతా బయట నుండి దర్శనాలు చేసుకుంటున్నారు. భక్తులు వారి ఎత్తుగాతెచ్చిన బంగారం (బెల్లం) అమ్మవారికి సమర్పిస్తున్నారు. జంపనవాగులు స్నానాలు ఆచరిస్తున్నారు అలాగే జంపనవాగులో ఎలాంటి ప్రమాదం జరగకుండా 300 మంది గజ ఈతగాళ్లను ఏర్పాటు చేశారు. గురువారం సాయంత్రం చిలకలగుట్ట నుండి సమ్మక్క గద్దనెక్కడంతో భక్తులకు నలుగురు దేవుళ్ళు పూర్తిస్థాయిలో దర్శనమివ్వనున్నారు. అంతేకాకుండా ట్రాన్స్ జెండర్స్ కొరతగా ప్రజలతో పాటు అమ్మవారు పుట్టేరిక జోగినిలుగా ఉండిపోతారు వారు ఎంతో భక్తిశ్రద్ధలతో కలవడంతో పాటు అమ్మవారికి బండారితో పాటు బియ్యం పోస్తారు. ట్రాన్స్ జెండర్లకు శివసతులకు గ్రామ పెద్దలు చీరసారలతో బొట్టు గాజులు పెట్టి ఆహ్వానిస్తారు. అంతేకాకుండా పూలు కూడా సమర్పించడం పరిపాటి. తాము శివుని ప్రతిరూపమని తాము ఎక్కువ సంఖ్యలో వేములవాడ రాజన్న తో పాటు సమ్మక్క సారక్కల దర్శన మాత్రమే చేసుకుంటామని అక్కడే అందరం కలుసుకోవడం జరుగుతుందని తెలిపారు. మమ్మల్ని కూడా ప్రజలు గౌరవిస్తున్నారని తెలిపారు. ఇప్పటికే వీరంతా డబ్బు చప్పుళ్ల మధ్య నృత్యాలు చేస్తూ వారి భక్తిశ్రద్ధలను చాటుకుంటున్నారు. వచ్చిన భక్తులకు ములుగు జిల్లా పోలీస్ యంత్రాంగం అన్ని రకాల సౌకర్యాలు కల్పించారు. జంపన్న వాగులో స్నానం చేసేటప్పుడు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 300 మంది గజ ఈతగాళ్లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: