Sunday, 21 June 2026 01:31:38 PM
# శ్రీ రామాలయ పునర్ ప్రతిష్ట మహోత్సవాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ప్రత్యేక ధన్యవాదాలు # 26 నఖరీఫ్ సీజన్ కు రైతు భరోసా అందించనున్న ప్రభుత్వం... # చికిత్స పొందుతూ యువకుడు మృతి # ఎల్.పి.జి.వినియోగదారులు బ్యాంకు ఖాతాలను ఆధార్‌తో అనుసంధానం చేసుకోవాలి... # రుద్రంగి మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గల్ఫ్ కార్మికుడు మృతి... # కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన సిర్పూర్ ఎమ్మెల్యే.. # నకిలీ, నాణ్యతలేని విత్తనాలపై ఉక్కుపాదం...! 220 దుకాణాల తనిఖీ.. 18 మందిపై 7 కేసులు 10.20 లక్షల విలువైన 1,181 పత్తి విత్తన ప్యాకెట్లు స్వాధీనం.. # పాఠశాల అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి.. # సేవా కార్యక్రమాలకు గౌరవ డాక్టరేట్ పురస్కారం అందుకున్న మడే రాజేష్ # జన్యుపరమైన అనారోగ్యంతో పోరాడుతున్న హనుమకొండకు చెందిన నిరంజన్..!అభిమాని నిరంజన్ ను పరామర్శించినపవన్ కళ్యాణ్... # ఆదివాసి మహిళలను చెప్పులతో కొట్టిన ఫారెస్ట్ అధికారులును వెంటనే సస్పెండ్ చేయాలి... # జిల్లాలో వన మహోత్సవాన్ని విజయవంతం చేయాలి.. # రైతు వేదికల్లో విత్తనాలు, ఎరువుల పంపిణీ .. ! కేంద్రం పైన ఎప్పటికప్పుడు ఒత్తిడి.. # మంచిర్యాలలో ఫిట్‌నెస్ లేని స్కూల్ బస్సులపై ఆర్టీఏ కొరడా.. 5 బస్సులు సీజ్ # వృద్ధాప్యంలో కొండంత అండ: రూ. 30 లక్షల ప్రమాద బీమా, రూ. 10 లక్షల సహజ మరణ బీమా కల్పించడం పట్ల సర్వత్రా హర్షం... # తెలంగాణ రాష్ట్ర సేన అధ్యక్షురాలికి ఘన స్వాగతం.. # ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమాన్ని 100 శాతం విజయవంతం చేయాలి.. # ఎమ్మెల్యే పై కవిత అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నాం.. # అంగన్‌వాడీలే చిన్నారుల భవిష్యత్తుకు బలమైన పునాదులు. మంత్రి సీతక్క.. # రైతులకు విత్తనాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే..

పాఠశాల అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి..

జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య

Date : 17 June 2026 09:31 PM Views : 28

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాలలో చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని మంచిర్యాల జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి చంద్రయ్య అన్నారు. బుధవారం జిల్లాలోని నస్పూర్ మండల కేంద్రంలో గల కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని సందర్శించి అభివృద్ధి పనుల పురోగతిని పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ అభివృద్ధి పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని,నాణ్యత ప్రమాణాలనుఖచ్చితంగా పాటించాలని తెలిపారు.విద్యార్థుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని నిర్లక్ష్యానికి తావు లేకుండా నిర్మాణ పనులు నిర్వహించాలని, నిర్మాణ సామగ్రి నాణ్యత, భద్రతా ప్రమాణాల విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు. విద్యార్థులకుఅందిస్తున్న వసతులు,విద్యా సదుపాయాలు,భోజనం తదితర అంశాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని క్రమశిక్షణతో చదివి ఉన్నత లక్ష్యాలను సాధించాలని విద్యార్థులకు సూచించారు.విద్యతో పాటు వ్యక్తిత్వ వికాసం, ఆరోగ్యం,పరిశుభ్రత పట్ల కూడా శ్రద్ధ చూపాలని సూచించారు.పాఠశాలలో విద్యార్థుల హాజరు నమోదు,అకడమిక్ రికార్డులు,ఇతర పరిపాలన రికార్డులను పరిశీలించి ఉపాధ్యాయులతో సమావేశమై విద్యార్థుల అభ్యాస స్థాయిలను నిరంతరం పర్యవేక్షించాలని తెలిపారు.ప్రతి విద్యార్థిపై ప్రత్యేక దృష్టి సారించి మెరుగైన ఫలితాలు సాధించేలా చర్యలు చేపట్టాలని సూచించారు.పాఠశాలలో పరిశుభ్రమైన వాతావరణం,క్రమశిక్షణ, నాణ్యమైన బోధనకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు.వంటగది, స్టోర్ రూమ్,తరగతి గదులు,వసతి గదులు, ఇతర సౌకర్యాలను పరిశీలించి విద్యార్థినుల సంక్షేమం ,భద్రతకు సంబంధించిన అంశాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం ప్రత్యేక అధికారి, ఉపాధ్యాయులు ,గుత్తేదారులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :