Monday, 14 September 2026 08:59:39 AM
# మహిళల నాయకత్వాన్ని బలపరచండి... మాదిగ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు నందిని # నీటి సంఘం అధ్యక్షులు తిమ్మారెడ్డి కృషితో మద్దూరు కుంటకు కేసీ.కెనాల్ జలాలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ఆశీర్వదించండి...! ఆత్మకూరు సింగల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దిన్ # పాములపాడులో ఘనంగా కామ్రేడ్ సీతారాం ఏచూరి రెండవ వర్ధంతి # ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి పి ఆర్ టి యు నంద్యాల జిల్లా శాఖ ప్రాతినిధ్యం # కార్మికుడి ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు... సింగరేణి భద్రతా ప్రమాణాలపై ఎంపీ హెచ్చరిక... # ప్రముఖ కవి సుద్దాల అశోక్ తేజకు ప్రతిష్టాత్మక సాహిత్య పురస్కారానికి ఎంపిక.. # ఫ్రీ బస్సు వద్దని మహిళల రాస్తారోకో.. # ఆర్థిక ఇబ్బందులతో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు జగన్ ఆత్మహత్య... # దసరా నుంచి లబ్ధిదారులకుకొత్త పింఛన్లు పంపిణీ... # శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్..

అసెంబ్లీ ముట్టడి తో రణరంగమైన హైదరాబాద్.. గిరిజన గర్జనతో దద్దరిల్లిన సర్కార్...

Date : 25 March 2026 09:53 PM Views : 187

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : లంబాడీలు న్యాయమైన హక్కుల సాధన కోసం లంబాడి హక్కుల పోరాట సమితి శంఖారావం పూరించింది. బుధవారం పిలుపునిచ్చిన ‘అసెంబ్లీ ముట్టడి’ ఉప్పెనలా ఎగిసిపడింది. రాష్ట్రవ్యాప్తంగా వేలాదిగా తరలివచ్చిన గిరిజన బిడ్డల నినాదాలతో శాసనసభ పరిసరాలు మార్మోగాయి. పోలీసుల ఇనుప కంచెలు, భారీ బారికేడ్లను తుత్తునియలు చేస్తూ లంబాడి హక్కుల పోరాట సమితి కార్యకర్తలు అసెంబ్లీ వైపు దూసుకెళ్లడంతో గంటల తరబడి ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీసులకు, కార్యకర్తలకు మధ్య జరిగిన పెనుగులాటలో అసెంబ్లీ ప్రాంగణం రణరంగాన్ని తలపించింది.మూడవత్ రాంబాల్ నాయక్ లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు మూడవత్ రాంబాల్ నాయక్ నేతృత్వంలో సాగిన ఈ పోరాటంలో గిరిజన గళం గర్జించింది. ఈ సందర్భంగా రాంబాల్ నాయక్ మాట్లాడుతూ ప్రభుత్వం గిరిజన హక్కులను కాలరాస్తోందని, ఓట్ల కోసం ఇచ్చిన హామీలను తుంగలో తొక్కుతోందని నిప్పులు చెరిగారు. "మా తండాల్లో మేమే రాజులంమా హక్కుల కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధం" అని హెచ్చరించారు. ప్రభుత్వం ముందు ఉంచిన డిమాండ్లు ఇవే.. గిరిజనుల ఆత్మగౌరవ ప్రతీకగా ప్రకటించిన చేవెళ్ల డిక్లరేషన్‌ను తక్షణమే ప్రభుత్వం అమలు చేయాలి. సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ పేరుపైన 100 ఎకరాలు కేటాయించి సంత్ శ్రీ సేవలాల్ మహారాజ్ & మేరామాయండి ( భవాని మత ) మందిరాన్ని నిర్మించాలన్నారు. సేవలాల్ మహారాజ్ పేరు పైన యూనివర్సిటీ నిర్మించాలన్నారు. రెవెన్యూ గ్రామ పంచాయతీలుకేవలం కాగితాల మీద కాకుండా, గిరిజన తండాలన్నింటినీ పూర్తిస్థాయి అధికారాలు కలిగిన రెవెన్యూ గ్రామ పంచాయతీలుగా గుర్తించి నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. సేవాలాల్ మహారాజ్ జయంతిని రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించి గిరిజన సంస్కృతినిగౌరవిం చాలన్నారు. ట్రై కార్ నిధులు మంజూరు చేయాలన్నారు. గతంలో రిలీజ్ చేసిన కలెక్టర్ నిధులను తక్షణమే రిలీజ్ చేయాలని డిమాండ్... నేతల అరెస్టు చేయడంతో ఉద్రిక్తత కొనసాగుతోంది. పోలీసులు ఎక్కడికక్కడ నిర్బంధించినా, చెక్ పోస్టులను దాటుకుంటూ అసెంబ్లీ గేట్ల వరకు చేరుకున్న నేతలను పోలీసులు బలవంతంగా ఈడ్చుకెళ్లి వాహనాల్లో ఎక్కించారు. గిరిజన నేతల అరెస్టులతో నగరం ఒక్కసారిగా అట్టుడికింది. ప్రభుత్వం తక్షణమే స్పందించకపోతే ఈ ఉద్యమం రాష్ట్రంలోని ప్రతి తండాకు వ్యాపిస్తుందని, సర్కార్ పతనం ఖాయమని లంబాడి హక్కుల పోరాట సమితి నాయకులుహెచ్చరించారు.ఈ కార్యక్రమంలో లంబాడి హక్కుల పోరాట సమితి ప్రధాన కార్యదర్శి మోహన్ నాయక్, మోతిలాల్ నాయక్, కేశంపేట మండల అధ్యక్షులు రాజు నాయక్, జగన్ నాయక్, యూత్ విభాగం అధ్యక్షులు సంజు నాయక్, కార్యనిర్వాహక అధ్యక్షులు అయోధ్య శ్రీనివాస్, యువజన విభాగం ప్రధాన కార్యదర్శి పరశురాం నాయక్, శివా నాయక్, కేశంపేట్ నాయకులు శీను, కొత్తూరు మండల యువ నాయకులు నాగేష్ నాయక్, నరేష్ నాయక్, రాజు నాయక్ తదితర నాయకులు పోలీసుల లాఠీలకు ఎదురునిలిచి పోరాడారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :