Saturday, 13 June 2026 02:24:14 PM
# సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి # పెంచిన గ్యాస్, డీజిల్, పెట్రోల్, నిత్యవసర వస్తువుల ధరలను వెంటనే తగ్గించాలి # ఎస్ఐఆర్ శిక్షణ తరగతులలో బూత్ లెవెల్ ఏజెంట్ లకు ఓటర్ల జాబితా గురించి అవగాహన సదస్సు # మద్దూరులో ఉపాధి కూలీ కుటుంబాన్ని పరామర్శించిన ఏపీవో- బి.జయంతి # పర్యావరణ పరిరక్షణ బాధ్యతను ప్రతి ఒక్కరూ తీసుకోవాలి # స్వీపింగ్ కార్మికుల నిరసన # ప్రతి ఒక్కరు పర్యావరణాన్ని కాపాడాలి # ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సైకిల్‌పై సందేశాత్మక ప్రయాణం ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోండి # ఇట్టి పట్టాలు మంజూరు చేయండి అని రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కే.ఎస్.జవహర్ కు వినతి # చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించిన శ్రీశైలం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # ఉపాధి హామీ శ్రామికులకు ఫేస్ యాప్ రద్దు చేయాలి # పదవీ విరమణ పొందిన ఏపీ ఎన్జీవోస్ తాలూకా అధ్యక్షుడు మోహన్ రెడ్డి నీ ఘనంగా సన్మానించిన ఎస్.సాజిద్ భాష # పదవి విరమణ పొందిన మండల సర్వేయర్ విద్యపోగు. భాస్కర్ కు ఘనంగా సన్మానం చేసిన రెవెన్యూ సిబ్బంది # ఆధా"రం"ర్‌ లేక...దశాబ్ద కాలంగా అంధకారంలోనే చెంచు గిరిజన కుటుంబం... # ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ పండుగలో పాల్గొన్న టిడిపి బీసీ సెల్ మండల అధ్యక్షుడు కంభం మోహన్ గౌడ్ # ఉత్తమ పోలీస్ ఏ.ఖాజా కు ఘనంగా సన్మానం చేసిన ప్రజా ప్రతినిధులు, ప్రజా సంఘాల నాయకులు # వేంపెంటలో స్పౌస్ పెన్షన్ ల పంపిణీలో పాల్గొన్న మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ # సి ఎం ఆర్ లక్ష్యాలను నిర్ణీత గడువు లోగా పూర్తి చేయాలి... # మహిళల సంక్షేమం కోసమే ప్రభుత్వం పని చేస్తుంది...

నామినేషన్ ప్రక్రియలో జాగ్రత్తగా వ్యవహరించలి

జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్

Date : 29 January 2026 10:04 PM Views : 200

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : 2వ సాధారణ మున్సిపల్ ఎన్నికలలో భాగంగా నామినేషన్ల ప్రక్రియలో జాగ్రత్తగా వ్యవహరించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. బుధవారం జిల్లాలోని లక్షెట్టిపేట మున్సిపల్ పరిధిలోని పాత మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ల స్వీకరణ కేంద్రాన్ని మండల తహసిల్దార్ దిలీప్ కుమార్, మున్సిపల్ కమిషనర్ విజయ్ కుమార్, మండల పరిషత్ అభివృద్ధి అధికారి సరోజ లతో కలిసి సందర్శించి నామినేషన్ల ప్రక్రియ తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ మాట్లాడుతూ 2వ సాధారణ మున్సిపల్ ఎన్నికలలో భాగంగా ఈ నెల 30వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించడం జరుగుతుందని, లక్షెట్టిపేట మున్సిపల్ పరిధిలోని 15 వార్డులకు సంబంధించి అభ్యర్థుల నుండి నామినేషన్లు స్వీకరించేందుకు చర్యలు చేపట్టడం జరిగిందని తెలిపారు. అభ్యర్థుల నామినేషన్ పత్రాలను ఎన్నికల సంఘం నిబంధనలకు లోబడి నిర్ణీత సమయంలోగా స్వీకరించాలని, 30వ తేదీ సాయంత్రం 5 గంటలలోగా నామినేషన్ స్వీకరణ కేంద్రంలో ఉన్నవారి నుండి నామినేషన్లు స్వీకరించడం జరుగుతుందని, సమయం ముగిసిన తర్వాత వచ్చిన వారి నుండి స్వీకరించడం జరగదని తెలిపారు. నామినేషన్ల స్వీకరణ కొరకు టేబుళ్లు ఏర్పాటు చేయడం జరిగిందని, 100 మీటర్ల నిబంధన అమలు చేయడం జరుగుతుందని తెలిపారు. నామినేషన్ దరఖాస్తులు నింపడం, జతపరచవలసిన పత్రాలు, ఇతర వివరాల కొరకు హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. 31వ తేదీన నామినేషన్లు పరిశీలించి అర్హత గల అభ్యర్థుల జాబితా ప్రకటన, ఫిబ్రవరి 1వ తేదీన నామినేషన్లపై అభ్యంతరాలు, ఫిర్యాదుల స్వీకరణ, 2వ తేదీన అభ్యంతరాలు, ఫిర్యాదుల పరిష్కారం, 3వ తేదీన నామినేషన్ల ఉపసంహరణ అనంతరం పోటీలో ఉండే అభ్యర్థుల తుది జాబితా ప్రకటన జరుగుతుందని తెలిపారు. ఫిబ్రవరి 11వ తేదీన పోలింగ్, 12వ తేదీన రీపోలింగ్ (ఏమైనా ఉన్నట్లయితే), 13వ ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపట్టి గెలుపొందిన అభ్యర్థుల ప్రకటన జరుగుతుందని తెలిపారు. మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో భాగంగా జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలో కంట్రోల్ రూమ్ నం.08736-250501 ఏర్పాటు చేయడం జరిగిందని, ఎన్నికల సంబంధించిన సమాచారం, ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘన పై ఫిర్యాదుల కొరకు సంప్రదించవచ్చని తెలిపారు. జిల్లాలో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం అధికారుల సమన్వయంతో చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :