ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : జగిత్యాల జిల్లా మోతె గ్రామంలో బుధవారంవిషాదకర సంఘటన చోటుచేసుకుంది. అప్పుల బాధతో మంగళవారం గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన దొడ్ల సంపత్ చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. కొడుకు మృతిని తట్టుకోలేక తల్లి కూడా గుండెపోటుతో మృతి చెందింది. కొద్ది గంటల వ్యవధిలోనే తల్లికొడుకులు మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Admin
E Nivas News