Sunday, 13 September 2026 01:12:17 AM
# కార్మికుడి ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు... సింగరేణి భద్రతా ప్రమాణాలపై ఎంపీ హెచ్చరిక... # ప్రముఖ కవి సుద్దాల అశోక్ తేజకు ప్రతిష్టాత్మక సాహిత్య పురస్కారానికి ఎంపిక.. # ఫ్రీ బస్సు వద్దని మహిళల రాస్తారోకో.. # ఆర్థిక ఇబ్బందులతో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు జగన్ ఆత్మహత్య... # దసరా నుంచి లబ్ధిదారులకుకొత్త పింఛన్లు పంపిణీ... # శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్.. # కోతులను పారద్రోలడానికి కొండెంగ అవతారం ఎత్తిన ఉపసర్పంచ్ # కొండగట్టు బస్ ప్రమాద విషాదానికి నేటికి ఎనిమిదేళ్ళు... # అడవుల సంరక్షణలో అటవీ అధికారుల పాత్ర కీలకమైనది.. కలెక్టర్ కుమార్ దీపక్ # ఓటర్ల ధ్రువపత్రాల పరిశీలన వేగవంతంగా చేయాలి.. కలెక్టర్ కుమార్ దీపక్ # ఘనంగా పోలాల అమావాస్య’ వేడుకలు.. ఎద్దులను అందంగా అలంకరించి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు..

ఘనంగా జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతి వేడుకలు

Date : 30 January 2026 05:49 PM Views : 254

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / జయశంకర్ భూపాలపల్లి / ప్రతినిధి : కాటారం మండల ఆర్యవైశ్య సంఘం, వాసవి క్లబ్ ల ఆధ్వర్యంలో శుక్రవారం రోజున జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతి వేడుక లను ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని హమాలి సంఘం వద్ద గల గాంధీ విగ్రహానికి పూల మాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం ఆర్యవైశ్య సంఘం సబ్యులు, వాసవి క్లబ్ సబ్యులు కలిసి పులిహోర ప్యాకెట్, స్వీట్లు, పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు మద్ది నవీన్ కుమార్ మాట్లాడుతూ దేశానికి గాంధీ చేసిన సేవల ను, ఆయన అహింస మార్గాన్ని కొనియాడుతూ ఆయన ఆశయాలకు అనుగుణంగా నడుచుకోవాలని అన్నారు. వాసవి క్లబ్ కాటా రం అధ్యక్షుడు మద్ది కమల మనోహర్ మాట్లాడుతూ అహింసా, సత్యాగ్రహాలే ఆ యుధాలుగా దేశానికి స్వేచ్ఛా, స్వాతంత్రాలు అందించిన మహనీయుడు జాతి పిత మహాత్మాగాంధీ అని అన్నాడు. సర్వజన హితం నామతం. అంటరానితనాన్ని అంత కలహాలను అంతం చేసేందుకు నా ఆయువు అంకితం అంటూ జాతి పిత మహాత్మాగాంధీ సందేశం ఇచ్చారని, నిత్యం అహింసాయుత మార్గంలో సత్యమే పరమావధిగా జీవించిన మహనీయుడని, అదే మార్గంలో భారతావనికి స్వాతంత్య్రం సంపాదించిన మహనీయుడు మహాత్మా గాంధీ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కాటారం గ్రామ సర్పంచ్ పంత కాని సడవలి, ఉప సర్పంచ్ కొండగొర్ల బానయ్య, జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు పవిత్రం శ్రీనివాస్, మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు మద్ది నవీన్ కుమార్, కోశాధికారి దారం నందకిషోర్, వాసవి క్ల బ్ కాటారం అధ్యక్షుడు మద్ది కమల మనోహర్, ప్రధాన కార్యదర్శి అల్లాడి ఓం ప్రకాష్, కోశాధికారి మద్ది సంపత్, ఆర్యవైశ్య సంఘం సబ్యులు, వాసవి క్లబ్ సబ్యులు తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :