ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / మహబూబాబాద్ / కురవి : మహబూబాబాద్ జిల్లా: అక్టోబర్. 24. కురవి మండలం తట్టుపల్లి గ్రామానికి చెందిన సీనియర్ జర్నలిస్టు టీయూడబ్ల్యూజే (ఐజేయు ) దాడులు నియంత్రణ కన్వీనర్ బేతమల్ల సహదేవ్ ఇటీవల జరిగిన ద్విచక్ర వాహన ప్రమాదంలో గాయపడిన విషయం తెలుసుకున్న డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే డిఎస్ రెడ్యానాయక్ తట్టుపల్లిలోని తన నివాసానికి వెళ్లి సహదేవ్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఆయన వెంట జిల్లా బీఆర్ఎస్ నాయకులు బజ్జురి పిచ్చిరెడ్డి, గుగులోత్ రవి నాయక్, పోరెడ్డి రాంరెడ్డి, పోతుగంటి వెంకన్న, కొత్త ప్రభాకర్, అంతటి యాలాద్రి, వంగాల ఆచారి తదితరులు ఉన్నారు.
Admin
E Nivas News