ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ పట్టణంలోని ఎస్పిఎం మైదానంలో ఉత్తర భారతీయులు ప్రతి ఏటా కార్తీక మాసంలో నిర్వహించే ఛట్ పూజా కార్యక్రమంలో మంగళవారం కుమురం భీం జిల్లా మాజీ జెడ్పి ఛైర్మెన్ కోనేరు కృష్ణ రావు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ప్రతి ఏటా కార్తీక మాసంలో నిర్వహించే ఛట్ పూజా కార్యక్రమంలో ఉత్తర భారతీయులు అత్యంత నిష్టతో సూర్యభగవానునికి పూజలు చేసి,నీటిలో ఉండి సూర్యభగవానుని ప్రార్థిస్తారు. ఈ సందర్భంగా చివరి రోజుఉదయం పూజా కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం కోనేరు కృష్ణ రావు మాట్లాడుతూ సూర్యభగవానుని ప్రతి ఒక్కరు పూజించాలన్నారు. ఏం లేవగానే సూర్యభగవానుడు దర్శనమిస్తాడు అన్న విషయం ప్రతి ఒక్కరికి తెలుసు అన్నారు. ప్రత్యేక పూజలు చేసి ప్రజానీకానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ కౌన్సలర్ విజయ్ యాదవ్, భక్తులు పాల్గొన్నారు.
Admin
E Nivas News