Tuesday, 15 September 2026 02:27:03 AM
# మహిళల నాయకత్వాన్ని బలపరచండి... మాదిగ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు నందిని # నీటి సంఘం అధ్యక్షులు తిమ్మారెడ్డి కృషితో మద్దూరు కుంటకు కేసీ.కెనాల్ జలాలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ఆశీర్వదించండి...! ఆత్మకూరు సింగల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దిన్ # పాములపాడులో ఘనంగా కామ్రేడ్ సీతారాం ఏచూరి రెండవ వర్ధంతి # ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి పి ఆర్ టి యు నంద్యాల జిల్లా శాఖ ప్రాతినిధ్యం # కార్మికుడి ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు... సింగరేణి భద్రతా ప్రమాణాలపై ఎంపీ హెచ్చరిక... # ప్రముఖ కవి సుద్దాల అశోక్ తేజకు ప్రతిష్టాత్మక సాహిత్య పురస్కారానికి ఎంపిక.. # ఫ్రీ బస్సు వద్దని మహిళల రాస్తారోకో.. # ఆర్థిక ఇబ్బందులతో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు జగన్ ఆత్మహత్య... # దసరా నుంచి లబ్ధిదారులకుకొత్త పింఛన్లు పంపిణీ... # శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్..

దేశ సంస్కృతి సంప్రదాయాలకు కేంద్ర బిందువు ఆర్ఎస్ఎస్

ఆరు జిల్లాల సహాయ వ్యవస్థాపకులు మురళి

Date : 12 October 2025 04:18 PM Views : 454

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) కార్యకర్తలు దేశ రక్షణ పట్ల, సంస్కృతి సాంప్రదాయాలకు కేంద్ర బిందువుగా అచంచల దీక్షతో ముందుకు వెలుతున్నారని ఆర్ఎస్ఎస్ ఆరు జిల్లాల సహాయ వ్యవస్థాపకులు దావునూరి మురళి అన్నారు. ఆదివారం మంథని గాంధీ చౌక్ లో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ శతాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ దేశమంటే మనుషులే కాదు దేశమంటే మట్టి అని సంఘ్ భావిస్తుందన్నారు. వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఆర్ఎస్ఎస్ సంస్థ దిన దినం అభిప్రాయంతో దేశంలోని మారుమూల ప్రాంతాల్లో కూడా పూర్తిగా విస్తరించిందని ఆయన గుర్తు చేశారు. 1962 లో పాకిస్తాన్ తో జరిగిన యుద్ధంలో ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు చూపిన ధైర్యసహసాలను గుర్తించిన అప్పటి ప్రధానమంత్రి దేశ సైనికులతో పాటు పరేడ్లో పాల్గొనాలని చెప్పిన మాటలను ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. అలాగే అప్పటి ప్రధానమంత్రి ఆర్ఎస్ఎస్ ఉన్నంతకాలం దేశం సుభిక్షంగా ఉంటుందని కొనియాడారన్నారు. ఏ సంస్థలో అయినా పదవుల పంచాయతీ ఉంటుందని ఆర్ఎస్ఎస్ లో మాత్రం క్రమశిక్షణ ఉంటుందని ఆయన పేర్కొన్నారు. అనంతరం కార్యవాహ గర్రెపల్లి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్ విధి విధానాల పట్ల యువత ఎంతో ఆకర్షితులవుతున్నారని క్రమశిక్షణ కలిగిన ఆర్ఎస్ఎస్ మనిషి జీవన విధానానికి బాటలు వేస్తుందన్నారు. అనంతరం స్వయం సేవకులు గణ వేశ్ ధరించి సిటీ కేబుల్, లక్ష్మీనారాయణ స్వామి దేవాలయం, ప్రణవి జూనియర్ కళాశాల, మహాలక్ష్మి దేవాలయం, మందాట, మంత్రపురి దర్శన్, జ్యోతిరావు పూలే కూడలి, అంబేద్కర్ కూడలి, శ్రీపాద చౌక్ మీదుగా గాంధీ చౌక్ కొరకు రూట్ మార్చ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బౌద్ధిక్ ప్రముఖ్ లక్కిరెడ్డి అన్వేష్, ధర్మ జాగరణ సేవా ప్రముఖులు మారుపాక నాగన్న కనుకుంట్ల స్వామి, పెద్దపల్లి వ్యవస్థాపకులు మాడిశెట్టి సుదర్శన్, సురేందర్, కొండపాక సత్య ప్రకాష్, లింగం శంకర్ తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: