Wednesday, 29 July 2026 12:50:15 AM
# కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు # ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం-వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత # ఆత్మకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంపై అవగాహన ర్యాలీ # అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య... # చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి... # చట్టబద్ధంగా హైడ్రా సంస్థ నడుస్తుంది.. ! కమిషనర్ రంగనాథ్‌ # విద్యార్థుల భవిష్యత్తుపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. # విద్యార్థుల పోరాటమే నీట్ పేపర్ లీకేజీ పై విజయం.. # అదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు 2,278.14 కోట్ల నిధులు మంజూరు... # ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది... # కేంద్ర మంత్రి జయంత్ చౌదరితో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి చర్చలు.. # మాట నిలబెట్టుకున్న బోయిన్ పేట్ కౌన్సిలర్ పోతరవేని శ్రీలత క్రాంతి... # ఎస్ఎంహెచ్ బాలికల హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి

మధ్యాహ్న భోజనపెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలి సీఐటీయూ జిల్లా కార్యదర్శి రంజిత్

Date : 18 November 2025 12:25 PM Views : 302

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం వండి పెడుతున్న కార్మికుల పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి ముల్కల రంజిత్ కుమార్ డిమాండ్ చేశారు. సోమవారం మండల ఎంఈఓ కార్యాలయం ఎదుట ధర్నా చేసి ఎంఈఓ శైలజకు వినతి పత్రం అందజేశారు. అనంతరం రంజిత్ కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన నిర్వాహకుల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయన్నారు. పది నెలలుగా పెండింగ్లో ఉన్న కోడిగుడ్ల బిల్లులు, జీతాలు, మెనూ బిల్లులు ప్రభుత్వం సకాలంలో చెల్లించకపోవడంతో కార్మికులు అప్పులు చేసి బడి పిల్లలకు మధ్యాహ్న భోజనం పెడుతున్నారన్నారు. కార్మికుల పట్ల ప్రభుత్వ విధానం సరైనది కాదన్నారు. అనంతరం మధ్యాహ్న భోజన కార్మిక సంఘం జిల్లా అధ్యక్షురాలు దాసరి రాజేశ్వరి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు మేం అధికారంలోకి వస్తే 10 వేల వేతనం చెల్లిస్తామని చెప్పి మాతో ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత మా సమస్యలు పట్టించుకోవడం లేదన్నారు. బిల్లులు సకాలంలో చెల్లించకపోవడం వలన మాకు కిరాణా దుకాణంలో సరుకులు కూడా ఉద్దెర ఇవ్వడం లేదన్నారు. ఇప్పుడు కొత్తగా 60 ఏండ్లు నిండిన కార్మికులను తొలగిస్తామంటూ న్నారని,అది సరైనది కాదన్నారు.గత ప్రభుత్వంలోని ఐదు నెలల టిఫిన్ డబ్బులు వెంటనే చెల్లించాలన్నారు. ధరలకు అనుగుణంగా మెనూ చార్జీలు పెంచాలన్నారు. కోడిగుడ్లను, గ్యాస్ ను ప్రభుత్వమే ఉచితంగా సరఫరా చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు వచ్చిన హామీలను అమలు చేయాలన్నారు. ప్రతి కార్మికురాలికి ప్రమాద బీమా, ఉద్యోగ భద్రత, పెన్షన్, ప్రభుత్వ సంక్షేమ పథకాలలో ప్రాధాన్యతనివ్వాలన్నారు. ప్రభుత్వం మా సమస్యలు పరిష్కారం చేయకపోతే రాబోయే రోజుల్లో పోరాటాలను తీవ్రతరం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మధ్యాహ్న భోజన కార్మికులు పోసమ్మ, అమృత, శంకరమ్మ, లక్ష్మి,లచ్చవ్వ, మల్లేశ్వరి, జానకి తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: