ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : ఖరీఫ్ 2026 సీజన్‌లో ప్రభుత్వం సూచించిన 7 రకాల సన్న వరి సాగు చేసే రైతులకు ఎకరానికి రూ.500 బోనస్ అందించనుంది. ఈ బోనస్ పొందడానికి రైతులు సెప్టెంబర్ 10, 2026లోపుతప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని అధికారులు వెల్లడించారు. డీలర్ల వద్ద విత్తనాలు కొన్నవారు అక్కడే, సొంత లేదా ఇతర విత్తనాలు వాడిన వారు స్థానిక వ్యవసాయ విస్తరణ అధికారి వద్ద పేరు నమోదు చేసుకోవాలని సూచించారు. ఆ తర్వాత వచ్చే దరఖాస్తులు స్వీకరించబడవని స్పష్టం చేశారు.
Admin
E Nivas News