Monday, 14 September 2026 01:30:48 AM
# మహిళల నాయకత్వాన్ని బలపరచండి... మాదిగ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు నందిని # నీటి సంఘం అధ్యక్షులు తిమ్మారెడ్డి కృషితో మద్దూరు కుంటకు కేసీ.కెనాల్ జలాలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ఆశీర్వదించండి...! ఆత్మకూరు సింగల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దిన్ # పాములపాడులో ఘనంగా కామ్రేడ్ సీతారాం ఏచూరి రెండవ వర్ధంతి # ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి పి ఆర్ టి యు నంద్యాల జిల్లా శాఖ ప్రాతినిధ్యం # కార్మికుడి ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు... సింగరేణి భద్రతా ప్రమాణాలపై ఎంపీ హెచ్చరిక... # ప్రముఖ కవి సుద్దాల అశోక్ తేజకు ప్రతిష్టాత్మక సాహిత్య పురస్కారానికి ఎంపిక.. # ఫ్రీ బస్సు వద్దని మహిళల రాస్తారోకో.. # ఆర్థిక ఇబ్బందులతో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు జగన్ ఆత్మహత్య... # దసరా నుంచి లబ్ధిదారులకుకొత్త పింఛన్లు పంపిణీ... # శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్..

ఆటో డ్రైవర్లకు భూక్యా జాన్సన్ నాయక్ భరోసా

నియోజకవర్గ ఆటో డ్రైవర్లందరికీ ప్రమాద బీమా కల్పిస్తానని ప్రకటించిన భూక్యా జాన్సన్ నాయక్

Date : 26 January 2026 11:30 PM Views : 191

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గంలోని అన్ని మండలాల ఆటో డ్రైవర్లకు తన వంతు సహాయంగా రూ.5 లక్షల ప్రమాద బీమా ప్రీమియం నేనే చెల్లిస్తానని మరోసారి జాన్సన్ నాయక్ తన మంచి మనసును చాటుకున్నారు. సోమవారం ఖానాపూర్ నియోజకవర్గ కేంద్రంలోని బస్టాండ్ వద్ద ఆటో డ్రైవర్లతో సమావేశమైన జాన్సన్ నాయక్ రాష్ట్రంలో ఆటో డ్రైవర్లపై కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని తీవ్రంగా విమర్శించారు. గత పదేళ్ల కేసీఆర్ ప్రభుత్వం ఆటో కార్మికులకు ఎల్లప్పుడూ అండగా నిలిచిందని. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేకపోతున్నదని రూ.5 లక్షల బీమా రద్దు చేసి ఆటో అన్నలకు కాంగ్రెస్ ప్రభుత్వం ద్రోహం చేసిందని. కేసీఆర్ గారి ప్రభుత్వం అసంఘటిత రంగ కార్మికులకు రైతు బీమా తరహాలో రూ.5 లక్షల ప్రమాద బీమాను అమలు చేసిందని గుర్తు చేశారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అక్టోబర్ నుంచి బీమా ప్రీమియం చెల్లించకపోవడంతో ఆటో డ్రైవర్లు ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి ఆటో డ్రైవర్‌కు రూ.24,000 కాంగ్రెస్ బాకీ నెలకు రూ.1,000 చొప్పున (సంవత్సరానికి రూ.12,000) సహాయం చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చినా రెండేళ్లు గడుస్తున్నా ఆ హామీని నెరవేర్చలేదని రెండు సంవత్సరాలకు కలిపి ప్రతి ఆటో డ్రైవర్‌కు ప్రభుత్వం రూ.24,000 బాకీ ఉందని ఆ బాకీని వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. అలాగే 100 రోజుల్లో ఏర్పాటు చేస్తామని చెప్పిన సంక్షేమ బోర్డును కూడా ఇంకా ఏర్పాటు చేయకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. ఖానాపూర్ నియోజకవర్గ వ్యాప్తంగా దాదాపు 3000 మంది పైన ఆటో డ్రైవర్లు ఉన్నారని వారికి ప్రభుత్వం బీమా కట్టకపోవడంతో వ్యక్తిగతంగా తానే బీమా ప్రీమియం చెల్లిస్తానని జాన్సన్ నాయక్ ప్రకటించారు. దీని ద్వారా ప్రభుత్వానికి సిగ్గు వచ్చి రాష్ట్రవ్యాప్తంగా డ్రైవర్లందరికీ బీమా చెల్లించే పరిస్థితి రావాలని ఆశిస్తున్నట్లు తెలిపారు.కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్న ఆటో డ్రైవర్లు జాన్సన్ నాయక్ గారికి హృదయాపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ల అద్యక్షులు ఆటో డ్రైవర్లు మాజీ ప్రజా ప్రతినిధులు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: