ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బాలాజీ ఆనుకోడ గ్రామానికి చెందిన డుబ్బుల లక్ష్మి గతంలో రవీంద్రనగర్ ప్రాంతంలో అడవి పంది దాడిలో దురదృష్టవశాత్తు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద ఘటన నేపథ్యంలో ప్రభుత్వం వారి కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సహాయాన్ని మంజూరు చేసింది. ఈ మేరకు తొలి విడతగా రూ.5 లక్షల విలువైన చెక్కును గురువారం కాగజ్ నగర్ ఫారెస్ట్ డివిజనల్ ఆఫీసు లో మృతురాలి కుమారుడు డుబ్బుల నారాయణకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీదండే విఠల్ మరియు ఫారెస్ట్ డివిజనల్ అధికారి అప్పయ్య అందజేశారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో చింతల మానేపల్లి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ సుభాష్,కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు డుబ్బుల నానయ్య , జిల్లా కాంగ్రెస్ కార్యవర్గ సభ్యులు డుబ్బుల వెంకన్న, కార్జేల్లి సర్పంచ్ చౌదరి నారాయణ అటవీ శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు మరియు గ్రామస్థులు పాల్గొన్నారు.
Admin
E Nivas News