Saturday, 12 September 2026 10:22:07 PM
# శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్.. # కోతులను పారద్రోలడానికి కొండెంగ అవతారం ఎత్తిన ఉపసర్పంచ్ # కొండగట్టు బస్ ప్రమాద విషాదానికి నేటికి ఎనిమిదేళ్ళు... # అడవుల సంరక్షణలో అటవీ అధికారుల పాత్ర కీలకమైనది.. కలెక్టర్ కుమార్ దీపక్ # ఓటర్ల ధ్రువపత్రాల పరిశీలన వేగవంతంగా చేయాలి.. కలెక్టర్ కుమార్ దీపక్ # ఘనంగా పోలాల అమావాస్య’ వేడుకలు.. ఎద్దులను అందంగా అలంకరించి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు.. # పాఠశాలల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలి.. కలెక్టర్ యువరాజ్ మర్మత్.. # ఆత్మహత్యల నివారణ దినం పోస్టర్ ఆవిష్కరణలో జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి.గితే.. # పోలీస్–అటవీ శాఖల మధ్య మరింత సమన్వయంతో అటవీ సంపద, వన్యప్రాణుల రక్షణకు చర్యలు తీసుకుంటాం... ఎస్పి అశోక్ కుమార్.. # హియరింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలి... కలెక్టర్ కుమార్ దీపక్ # చిట్యాల ఐలమ్మ పోరాట స్ఫూర్తిని నేటి యువతరం ఆదర్శంగా తీసుకొని సమాజంలో ఆర్థిక అసమానతల నిర్మూలనకై కృషి చేయాలి

అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్...

Date : 12 September 2026 02:18 AM Views : 17

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : సమాజంలోని అన్ని వర్గాలకు బిఎస్పీ జెండా అండగా ఉంటుందని వరంగల్ జోన్-2 ఇంచార్జ్ వరికిల్ల మల్లేష్ అన్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రం ఆస్పరెంట్ అకాడమీ లో శుక్రవారం మంచిర్యాల జిల్లా బహుజన్ సమాజ్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బహుజన్ సమాజ్ పార్టీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు ముల్కల్ల రాజేంద్రప్రసాద్ అధ్యక్షత వహించగా వరంగల్ జోన్ 2 ఇన్చార్జి వరికిల్ల మల్లేష్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసిన అనంతరం బహుజన్ సమాజ్ పార్టీ నాయకులు కార్యకర్తలను ఉద్దేశించి వరికిల్ల మల్లేష్ మాట్లాడుతూ పూలే, చత్రపతి సాహు మహారాజ్, పెరియార్, అంబేద్కర్, కాన్సిరాం, ఇతర మహనీయుల వారి స్ఫూర్తి ఆశయ సాధన బహుజన్ సమాజ్ పార్టీ లక్ష్యమని, అన్ని వర్గాలకు అండ బిఎస్పి జెండా అండగా ఉంటుందని అన్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూర్, బెల్లంపల్లి, మంచిర్యాల నియోజకవర్గం లలో బూత్ కమిటీలు, సెక్టర్ కమిటీలు త్వరితగతిన పూర్తి చేయాలని తెలిపారు. మహనీయుల పోరాట స్ఫూర్తితో ప్రజా సమస్యల పరిష్కారానికి బహుజన్ సమాజ్ పార్టీ కార్యకర్తలు నిరంతరం సిద్ధంగా ఉండాలన్నారు. ప్రజా సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుపోవాలని మంచిర్యాల జిల్లాలో పార్టీ బలోపేతం లక్ష్యంగా ముందుకు సాగాలని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ శ్రేణులను సిద్ధం చేయాలన్నారు. చెన్నూర్ నియోజకవర్గం నూతన ఇన్చార్జిగా దుర్గం గంగారం ను నియమించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఈసీ నెంబర్ శెట్టి ప్రవళిక మంచిర్యాల నియోజకవర్గ ఇంచార్జి పెట్టం చంద్రశేఖర్, నియోజవర్గం అధ్యక్షులు బండారి రాజ్ కుమార్, నియోజకవర్గం ప్రధాన కార్యదర్శి సిరివేని రాజేష్, బెల్లంపల్లి నియోజకవర్గ అధ్యక్షులు దాగం శ్రీనివాస్, ఉపాధ్యక్షులు కుంటాల శ్రీనివాస్ మరియు పార్టీ సీనియర్ నాయకులు సేట్టి శంకరయ్య, జాగిరి రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :