ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : కూకట్ పల్లి జీహెచ్ఎంసీ జోనల్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు బుధవారం ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా సూపరింటెండింగ్ ఇంజనీర్ (ఎస్‌ఈ) చిన్నారెడ్డి ఓ కాంట్రాక్టర్ నుంచి రూ.15 లక్షల లంచంతీసుకుంటుండగా ఏసీ అధికారులు పట్టుకున్నారు. పెండింగ్‌లో ఉన్న బిల్లుల క్లియరెన్స్ కోసం లంచం డిమాండ్ చేసినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. ముందుగా ఫిర్యాదు అందడంతో పక్కా ప్రణాళికతో వలపన్నిన అధికారులు, లంచం తీసుకుంటున్న సమయంలోనే ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతిపై ఎలాంటి ఉపేక్ష ఉండదని, ఇలాంటి చర్యలపై కఠిన చర్యలు కొనసాగుతాయని ఏసీబీ అధికారులు స్పష్టం చేశారు.
Admin
E Nivas News