Wednesday, 29 July 2026 09:14:54 PM
# వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు # ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం-వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత # ఆత్మకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంపై అవగాహన ర్యాలీ # అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య... # చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి... # చట్టబద్ధంగా హైడ్రా సంస్థ నడుస్తుంది.. ! కమిషనర్ రంగనాథ్‌ # విద్యార్థుల భవిష్యత్తుపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. # విద్యార్థుల పోరాటమే నీట్ పేపర్ లీకేజీ పై విజయం..

విద్య, వైద్య రంగాల అభివృద్ధిపై ప్రత్యేక చర్యలు తీసుకుంటాం...

కలెక్టర్ కుమార్ దీపక్

Date : 08 March 2026 12:28 AM Views : 172

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : ప్రభుత్వం విద్య, వైద్య రంగాల అభివృద్ధిపై ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ సూచించారు. శనివారం జిల్లాలోని లక్షెట్టిపేట మండల కేంద్రంలో గల కస్తూరిబా గాంధీ బాలికలవిద్యాలయాన్ని ఆకస్మికంగా సందర్శించి తరగతిగదులు,వంటశాల,హాజరుపట్టికలు,పాఠశాల పరిసరాలను పరిశీలించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూఅన్ని ప్రభుత్వ పాఠశాలలలో సకల సదుపాయాలు కల్పించి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. మధ్యాహ్న భోజనంలో మెనూ ప్రకారం పౌష్టిక ఆహారం, శుద్ధమైన త్రాగునీటిని అందిస్తూ విద్యార్థుల ఆరోగ్యం మరలా ప్రత్యేక శ్రద్ధ వహించడం జరుగుతుందని తెలిపారు. ప్రతి పాఠశాలలో త్రాగునీరు, విద్యుత్, విద్యార్థినీ విద్యార్థులకు వేరువేరుగా మూత్రశాలలు, అదనపు గదులు, ప్రహరీ గోడ ఇతర సదుపాయాలు కల్పించి నిష్ణాతులైన ఉపాధ్యాయులచే విద్యా బోధన అందించడం జరుగుతుందని తెలిపారు. అనంతరం మండల కేంద్రంలోని 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి వార్డులు, మందుల నిల్వలు, రోగులకు కల్పిస్తున్న సౌకర్యాలు, మార్చురీ గది నిర్మాణ పనులనుపరిశీలించారు. ఆసుపత్రికి వచ్చే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, వైద్యులు, సిబ్బంది విధుల పట్ల సమయపాలన పాటించాలని తెలిపారు. ఆసుపత్రి లోని రోగులతో మాట్లాడుతూ కల్పిస్తున్న సౌకర్యాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :