ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : మున్సిపాలిటీ ఎన్నికల సందర్భంగా గురువారం చివ్వెంలా పోలీసుల ఆధ్వర్యంలో కుడకుడ గ్రామం నందు ఎన్నికల నియమావళి పట్ల ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం లో సూర్యాపేట డివిజనల్ డిఎస్పి ప్రసన్నకుమార్ మాట్లాడుతూ మున్సిపాలిటీ ఎన్నికలు సమీపిస్తున్నందున పౌరులు ప్రజలు ఎన్నికల నియమాలు లోబడి నడుచుకోవాలని ఎన్నికల సమయంలో తగాదాలు గొడవలు పెట్టుకుంటే ఎన్నికలు వచ్చిన ప్రతిసారి సమస్యలు వస్తాయని తెలియజేశారు. ప్రతి ఒక్కరు ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవడానికి పోలీస్ శాఖ పూర్తి రక్షణ కల్పిస్తుందని తెలిపారు. పోలీస్ శాఖ ఎన్నికల నిర్వహణ పట్ల నిశిత పరిశీలన చేస్తుందని ఎవరు కూడా గొడవలు తగాదాలు పెట్టుకోకూడదని కోరారు. ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులు ఎన్నికల నియమావళికి లోబడి ప్రచారం నిర్వహించుకోవాలని డబ్బులు ఉచితాలు మద్యం పేరుతో ఓటర్లను ప్రలోభాలకు గురి చేయకుండా ఓటర్ల మనసు గెలిచి బరిలో గెలవాలనిసూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎస్సై మహేష్, గ్రామ పెద్దలు, పౌరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News