Tuesday, 28 July 2026 06:59:38 PM
# చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు # ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం-వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత # ఆత్మకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంపై అవగాహన ర్యాలీ # అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య... # చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి... # చట్టబద్ధంగా హైడ్రా సంస్థ నడుస్తుంది.. ! కమిషనర్ రంగనాథ్‌ # విద్యార్థుల భవిష్యత్తుపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. # విద్యార్థుల పోరాటమే నీట్ పేపర్ లీకేజీ పై విజయం.. # అదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు 2,278.14 కోట్ల నిధులు మంజూరు... # ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది... # కేంద్ర మంత్రి జయంత్ చౌదరితో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి చర్చలు.. # మాట నిలబెట్టుకున్న బోయిన్ పేట్ కౌన్సిలర్ పోతరవేని శ్రీలత క్రాంతి... # ఎస్ఎంహెచ్ బాలికల హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి # టెలికామ్ వినియోగదారులకు మెరుగైన సేవలే ట్రాయ్ లక్ష్యం # భక్తిశ్రద్ధలతో బోనాల వేడుకలు.. # బెల్లంపల్లి ఎం.జె.పి. బాలికల పాఠశాల విద్యార్థినులు క్షేమం... # కేటీఆర్ అంకుల్‌కు 50వ జన్మదిన శుభాకాంక్షలు.. # విద్యా వ్యవస్థ పై విద్యార్థులకు నమ్మకం సన్నగిల్లింది... యు ఎస్ ఎఫ్ ఐ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ.. # ఘనంగా కేటీఆర్50వ జన్మదిన వేడుకలు.. # నల్లకాల్వ గ్రామంలో వర్షం కోసం గంగమ్మకు ప్రత్యేక పూజలు

ప్రతిష్టాత్మకంగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలల నిర్మాణం...

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక, ప్రణాళికా శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క

Date : 12 January 2026 08:42 PM Views : 250

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక, ప్రణాళికా శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. సోమవారం హైదరాబాద్ నుండి రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల, షెడ్యూల్డ్ తెగల, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్, పార్లమెంట్ సభ్యులు బలరాం నాయక్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, టి.జి.ఈ.డబ్ల్యూ.ఐ.డి.సి. ఎండి గణపతి లతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లు, టి.జి.ఈ.డబ్ల్యూ.ఐ.డి.సి. అధికారులతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణ పురోగతిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం గ్రామీణ ప్రాంత విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో విద్యను అందించి పోటీ ప్రపంచంలో నిలబడేలా తీర్చిదిద్దే ఉద్దేశంతో నిర్మిస్తున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలను త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ప్రస్తుతం కొనసాగుతున్న ఎస్. సి., ఎస్. టి., బి. సి రెసిడెన్షియల్ పాఠశాలలలా కాకుండా అందరికీ ఒకే చోట ఉమ్మడి కుటుంబంలా సకల సౌకర్యాలతో పాఠశాలలను ప్రతిష్టాత్మకంగానిర్మించడం జరుగుతుందని, రాష్ట్ర వ్యాప్తంగా 79 పాఠశాలలు మంజూరు కాగా 76 పాఠశాలలకు టెండర్లు పూర్తి కాబడి 18 పాఠశాలల్లో పనులు మొదలు పెట్టడం జరిగిందని తెలిపారు. ఆయా జిల్లాల కలెక్టర్లు ప్రతి వారం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలల నిర్మాణ పురోగతిపై సమీక్ష నిర్వహించాలని, ప్రతి నెలలో కనీసం ఒకసారి పాఠశాలల నిర్మాణాన్ని ప్రత్యక్షంగా తనిఖీ చేయాలని తెలిపారు. పాఠశాలలు నిర్మాణంలో ఉన్న చోట పనితీరు పురోగతిపై డాష్ బోర్డు ఏర్పాటు చేయాలని, తద్వారా ప్రభుత్వం ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవడం సులభతరం అవుతుందని తెలిపారు. జిల్లా కలెక్టర్లు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణంపై ప్రత్యేక చొరవ తీసుకొని, వచ్చే విద్యా సంవత్సరం నాటికి రాష్ట్రంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణం విషయంలో జిల్లా కలెక్టర్లు అలసత్వం ప్రదర్శించకూడదని, పూర్తి స్థాయి నాణ్యత ప్రమాణాలతో పాఠశాలలు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రేసిడెన్షియల్ పాఠశాలలలో విద్యతో పాటు క్రీడలు, సమాజంలో సవాళ్లను ఎదుర్కొనే విధంగా పర్సనాలిటీ డెవలప్మెంట్ తదితర అంశాలలో విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 3 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలు మంజూరు కాగా, సంబంధిత పాఠశాలలకు భూమిని కేటాయించడం జరిగిందని, టెండర్ ప్రక్రియ పూర్తి చేయడం జరిగిందని తెలిపారు. మంచిర్యాల నియోజకవర్గం దండేపల్లి మండలంలో పనులు మొదలు అయ్యాయని, మిగతా పాఠశాలల పనులు కూడా త్వరితగతిన మొదలుపెట్టి వచ్చే విద్యా సంవత్సరం నాటికి పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :