ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని సూర్యాపేట జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో నిర్మించిన శాశ్వత కళావేదికను శనివారం తెలంగాణ రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రిబ్బన్ కట్ చేసి కళావేదికను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తేజస్ నంద లాల్ పవార్, జిల్లా ఎస్పి నరసింహ, పాల్గొని ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు.జిల్లా స్థాయిలో జరిగే సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రభుత్వ వేడుకలు, ప్రదర్శనలు ఇకపై ఈ శాశ్వత కళావేదికపై నిర్వహించనున్నారు. దీంతో సూర్యాపేటకు మరో కొత్త శోభ సంతరించుకుంది. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, కళాకారులను ప్రోత్సహించడానికి, ప్రజలకు వినోదాన్ని అందించడానికి ఈ వేదిక ఉపయోగపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్థాయి అధికారులు, పోలీసు ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
Admin
E Nivas News