Tuesday, 28 July 2026 10:22:09 PM
# చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు # ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం-వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత # ఆత్మకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంపై అవగాహన ర్యాలీ # అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య... # చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి... # చట్టబద్ధంగా హైడ్రా సంస్థ నడుస్తుంది.. ! కమిషనర్ రంగనాథ్‌ # విద్యార్థుల భవిష్యత్తుపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. # విద్యార్థుల పోరాటమే నీట్ పేపర్ లీకేజీ పై విజయం.. # అదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు 2,278.14 కోట్ల నిధులు మంజూరు... # ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది... # కేంద్ర మంత్రి జయంత్ చౌదరితో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి చర్చలు.. # మాట నిలబెట్టుకున్న బోయిన్ పేట్ కౌన్సిలర్ పోతరవేని శ్రీలత క్రాంతి... # ఎస్ఎంహెచ్ బాలికల హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి # టెలికామ్ వినియోగదారులకు మెరుగైన సేవలే ట్రాయ్ లక్ష్యం # భక్తిశ్రద్ధలతో బోనాల వేడుకలు..

భారీ పెట్టుబడి మోసం కేసులో కీలక నిందితురాలు అరెస్ట్

Date : 25 April 2026 11:13 PM Views : 196

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్ల కాగజ్‌నగర్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన భారీ పెట్టుబడి మోసం కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. “డివైన్ గ్రూప్ ఆఫ్ కంపెనీ” పేరిట నకిలీ వ్యాపారం నిర్వహిస్తూ ప్రజలను పెట్టుబడులు పెట్టమని మోసం చేసిన కేసులో ప్రధాన నిందితురాలు థాకూర్ శివరంజని బాయిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ నితిక పంత్ శనివారం తెలిపారు.జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన పత్రికా సమావేశంలో ఎస్పీ వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి. నిందితులు అధిక లాభాలు వస్తాయని నమ్మబలికి బాధితుల నుంచి పెద్ద మొత్తంలో నగదు వసూలు చేశారు. 5 శాతం నుండి 20 శాతం వరకు లాభాలు ఇస్తామని చెప్పి మోసాలకు పాల్పడినట్లు గుర్తించారు. ఈ కేసులో మొత్తం ఐదుగురు నిందితులు ఉన్నారు. వీరిలో థాకూర్ శివరంజని బాయి అరెస్టు కాగా, మిగతా నిందితులు పరారీలో ఉన్నారు. నిందితురాలిని ఏప్రిల్ 24న సికింద్రాబాద్‌లో అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల దర్యాప్తులో భాగంగా, ఈ నిందితులు గతంలో కూడా వివిధ ప్రాంతాల్లో కోట్ల రూపాయల మోసాలకు పాల్పడ్డట్లు బయటపడింది. కాగజ్‌నగర్, పెంచికల్‌పేట్, లల్లగూడ, హైదరాబాద్ ప్రాంతాల్లో కూడా ఇలాంటి కేసులు నమోదైనట్లువెల్లడించారు.2021 ఆగస్టు నుండి 2023 జనవరి మధ్యకాలంలో కాగజ్‌నగర్ పట్టణంలో నివసిస్తూ ప్రజలను నమ్మబలికి డబ్బులు తీసుకుని పరారైనట్లు సమాచారం.ఇప్పటివరకు మరికొందరు బాధితులు కూడా ఫిర్యాదు చేయడానికి ముందుకు వస్తున్నారని పోలీసులు తెలిపారు.ఈ కేసులో నిందితురాలిని అరెస్ట్ చేయడంలో కీలక పాత్ర పోషించిన కాగజ్‌నగర్ డీఎస్పీ వాహిదుద్దీన్, టౌన్ ఇన్స్పెక్టర్ ప్రేమ్ కుమార్, ఎస్సై రాజు, మహిళా కానిస్టేబుళ్లు లక్ష్మి, జోష్ణ, బ్లెస్సి, శమీనా, కానిస్టేబుల్ విజయ్‌లను ఎస్పీ అభినందించారు. మిగిలిన నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :