Wednesday, 29 July 2026 01:44:35 AM
# కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు # ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం-వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత # ఆత్మకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంపై అవగాహన ర్యాలీ # అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య... # చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి... # చట్టబద్ధంగా హైడ్రా సంస్థ నడుస్తుంది.. ! కమిషనర్ రంగనాథ్‌ # విద్యార్థుల భవిష్యత్తుపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. # విద్యార్థుల పోరాటమే నీట్ పేపర్ లీకేజీ పై విజయం.. # అదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు 2,278.14 కోట్ల నిధులు మంజూరు... # ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది... # కేంద్ర మంత్రి జయంత్ చౌదరితో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి చర్చలు.. # మాట నిలబెట్టుకున్న బోయిన్ పేట్ కౌన్సిలర్ పోతరవేని శ్రీలత క్రాంతి... # ఎస్ఎంహెచ్ బాలికల హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి

పనస రాజయ్య భారీ మెజారిటీతో గెలుపు ఖాయం

ఎంపీ. గడ్డం వంశీకృష్ణ

Date : 09 February 2026 11:43 PM Views : 189

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : మంచిర్యాల జిల్లాక్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 10వ వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పనస రాజయ్య భారీ మెజారిటీతో విజయం సాధించడం ఖాయమని పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు, క్యాతనపల్లి మున్సిపాలిటీ ఎన్నికల టీపీసీసీ ఇంచార్జీ గడ్డం వంశీకృష్ణ ధీమా వ్యక్తం చేశారు. సోమవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా 10వ వార్డులో నిర్వహించిన కార్నర్ మీటింగ్‌లో మాట్లాడిన ఆయన, కాంగ్రెస్ పార్టీకి ప్రజల నుంచి విశేషమైన మద్దతు లభిస్తున్నదని తెలిపారు. పనస రాజయ్య ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే నాయకుడని, వార్డు అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నారని ప్రశంసించారు. అభివృద్ధిపై స్పష్టమైన హామీలు ఇచ్చారు. ఈ సందర్భంగా వంశీకృష్ణ ప్రజలకు పలు అభివృద్ధి హామీలు ఇచ్చారు. తాగునీటి సమస్యను పూర్తిస్థాయిలో పరిష్కరిస్తామని డ్రైనేజీ వ్యవస్థను మరింత మెరుగుపరుస్తామని రోడ్ల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్లు తెలిపారు. అలాగే, విద్యుత్ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతామని, ప్రజల భాగస్వామ్యంతో అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తామని వెల్లడించారు. కాంగ్రెస్ సంక్షేమ పథకాలపై విశ్వాసం కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజల్లో విశ్వాసాన్ని పెంచాయని ఆయన పేర్కొన్నారు. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు పేద కుటుంబాలకు మేలు చేశాయని, అర్హులైన వారికి రేషన్ కార్డులు అందుతున్నాయని,సన్నబియ్యం పంపిణీ ప్రజలకు లాభం చేకూర్చిందని తెలిపారు. ఈ అంశాలు కాంగ్రెస్ పార్టీ విజయానికి బలంగా మారుతున్నాయని స్పష్టం చేశారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :