Friday, 11 September 2026 10:15:28 PM
# ఓటర్ల ధ్రువపత్రాల పరిశీలన వేగవంతంగా చేయాలి.. కలెక్టర్ కుమార్ దీపక్ # ఘనంగా పోలాల అమావాస్య’ వేడుకలు.. ఎద్దులను అందంగా అలంకరించి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు.. # పాఠశాలల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలి.. కలెక్టర్ యువరాజ్ మర్మత్.. # ఆత్మహత్యల నివారణ దినం పోస్టర్ ఆవిష్కరణలో జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి.గితే.. # పోలీస్–అటవీ శాఖల మధ్య మరింత సమన్వయంతో అటవీ సంపద, వన్యప్రాణుల రక్షణకు చర్యలు తీసుకుంటాం... ఎస్పి అశోక్ కుమార్.. # హియరింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలి... కలెక్టర్ కుమార్ దీపక్ # చిట్యాల ఐలమ్మ పోరాట స్ఫూర్తిని నేటి యువతరం ఆదర్శంగా తీసుకొని సమాజంలో ఆర్థిక అసమానతల నిర్మూలనకై కృషి చేయాలి # ఆత్మకూరులో ఉద్యోగ సంఘాల నాయకులకు ఘనంగా సన్మానం చేసిన జేఏసీ # రానున్న కాలంలో జర్నలిస్టుల ఐక్యతతో హక్కుల సాధనకు ముందుకు వెళ్తాం... ఏపీఎంఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షులు డిల్లీబాబు రెడ్డి # ఆశా వర్కర్ల అక్రమ అరెస్టులు ఖండిస్తూ సీఐటీయు ఆధ్వర్యంలో రోడ్డు పై రాస్తారోకో..! అసెంబ్లీ సమావేశాల్లో ఆశాలకు 18వేలు ఫిక్స్ డ్ వేతనం నిర్ణయించాలి # పాత పెన్షన్ విధానం పునరుద్ధరించి బకాయిలు చెల్లించాలని నేడు ఎల్బీ స్టేడియంలో మహా ధర్నా... # మాజీ సీఎం కేసీఆర్‌పై చేసిన వ్యాఖ్యలతో తీవ్ర దుమారం... # కవితపై అనుచిత కామెంట్స్ చేసిన కానిస్టేబుల్‌పై నాన్‌బెయిలబుల్ కేసు నమోదు... # కాంగ్రెస్‌ ఎవరి చావునూ కోరుకోదు.. # శాసనసభ నుంచి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల హరీశ్‌రావు, కేటీఆర్‌తో సహా 22 మంది సస్పెన్షన్.. # తెలంగాణ గర్వించదగ్గ మహనీయుడు కాళోజి నారాయణరావు... # స్పీకర్ గారూ.. మా సభ్యుడు మిమ్మల్ని ఉద్దేశించి అనలేదు.. మాజీ మంత్రిహరీశ్ రావు... # పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు... 16 మంది పంచాయతీ కార్యదర్శులకు షోకాజ్ నోటీసులు... # ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై క్రిమినల్ కేసు పెట్టాలి... # స్పీకర్‌ కంటతడి దృశ్యాలపై ప్రసాద్‌కు సీఎం, డిప్యూటీ సీఎం పరామర్శ...

పరిశ్రమలను తీసుకురావడంపై ప్రత్యేక దృష్టి సారించాం..

ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు

Date : 19 August 2026 11:19 PM Views : 97

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : మంథని ప్రాంత అభివృద్ధి కోసం పరిశ్రమలను తీసుకురావడంపై ప్రత్యేక దృష్టి సారించామని, కోకాకోలా వంటి బహుళజాతి సంస్థ మంథనిలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు పేర్కొన్నారు. బుధవారం మంథనిలో పలు అభివృద్ధి పనులకు మంత్రులు కోమటిరెడ్డి, తుమ్మలతో కలిసి శ్రీధర్ బాబు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా శ్రీధర్ బాబు మాట్లాడుతూ యువతకు నైపుణ్య శిక్షణ అందించేందుకు ఇంజినీరింగ్‌ కళాశాల, పాలిటెక్నిక్‌ కళాశాలలతో పాటు ATC, NAC స్కిల్‌ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నామని, NAC స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌కు రూ.20 కోట్లు కేటాయించామన్నారు. ఎనిమిది నెలల్లో కేంద్రాన్ని అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను కోరారు. అప్పటివరకు సెంటినరీ కాలనీలో ఉన్న సింగరేణి భవనాలలో నాక్ కేంద్రం నడపాలని ఆయన సూచించారు. మంథని ప్రాంతానికి గత రెండున్నరేళ్లలో సుమారు రూ.800 కోట్ల అభివృద్ధి పనులకు నిధులు మంజూరయ్యాయని తెలిపారు. మంథని పట్టణంలోని బ్రిడ్జి నుంచి బస్‌ డిపో వరకు రూ.15 కోట్లతో రోడ్డు విస్తరణ పనులు చేపడుతున్నామని, మానేరు నదిపై కూడా వంతెన మంజూరైందన్నారు. గోదావరి నదిపై హై లెవల్‌ బ్రిడ్జి, అవసరమైన రహదారి విస్తరణ పనులకు నిధులు మంజూరు చేసిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. అవసరమైన భూసేకరణ ప్రక్రియను త్వరగా పూర్తి చేసి రహదారి పనులను వేగంగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు.

మంథని ప్రాంతంలో ఈ ఏడాది తక్కువ వర్షపాతం నమోదవుతున్న నేపథ్యంలో నీటిని పొదుపుగా వినియోగించాలని మంత్రి సూచించారు. సూపర్‌ ఎల్‌నినో పరిస్థితుల దృష్ట్యా రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టి సారించి వరి సాగును తగ్గించాలని కోరారు. ఆయిల్‌పామ్‌ వంటి ప్రత్యామ్నాయ పంటలకు ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలను రైతులు వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ కోయ శ్రీహర్ష, గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ అన్నయ్య గౌడ్‌, మంథని మున్సిపల్‌ చైర్మన్‌ వి. శ్రీనివాస్‌, వైస్‌ చైర్మన్‌ సహేందర్ రెడ్డి, రామగుండం మేయర్‌ ఎం. స్వామి, డిప్యూటీ మేయర్‌ పారుపల్లి ఎల్లయ్య,విద్యుత్ శాఖ సలహాదారు కాచే శశిభూషణ్, ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :