ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : వరంగల్ జిల్లారఘునాథ్ పల్లి పోలీస్ స్టేషన్ వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్బంగా,పోలీస్ స్టేషన్ ప్రాంగణాన్ని పరిశీలించి, రికార్డ్ రూమ్, స్టేషన్ రైటర్ రూమ్, రిసెప్షన్ సెంటర్ మరియు ఇతర విభాగాలను తనిఖీ చేసి, వాటిని తగిన విధంగా సంరక్షించుకోవాలని సూచించారు. అనంతరం పోలీస్ స్టేషన్ పరిధిలోని నేరాల రేటు, రోడ్డు ప్రమాదాలు, చోరీ కేసులు, నమోదైన కేసుల పురోగతి పై సీపీ ఆరా తీశారు. అధికారులు, సిబ్బంది పనితీరును మరింత మెరుగు పరుచుకుని చేపట్టాల్సిన విధి విధానాలపై సంబంధిత స్టేషన్ ఎస్‌ఐ, సర్కిల్ ఇన్స్ స్పెక్టర్ తగిన సూచనలు చేశారు. ప్రధానంగా ప్రస్తుతం రఘునాథ్ పల్లి మండలం దాని పరిసర ప్రాంతాలలో పెద్దపులి సంచరిస్తున్న నేపథ్యంలో, ప్రజలను అప్రమత్తం చేసి, ఎటువంటి ప్రాణనష్టం లేదా ఆస్తినష్టం జరగకుండా ఫారెస్ట్ సిబ్బందితో సమన్వయం చేసుకొని తగిన జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సీపీ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఘన్పూర్ ఏసీపీ భీం శర్మ, సర్కిల్ ఇన్స్ స్పెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, రఘునాథ్పల్లి ఎస్. ఐ న రేష్ తో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
Admin
E Nivas News