Thursday, 30 July 2026 07:24:49 AM
# మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు

జన్నారంలో బీ సీ సంఘాల రోకో

Date : 14 October 2025 11:24 AM Views : 320

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : జాతీయ, రాష్ట్ర బీ సీ సంఘాల పిలుపు మేరకు సోమవారం జన్నారం మండల బీసీ సంఘాల ఆధ్వర్యంలో జాతీయ రహదారుల దిగ్బంధం కార్యక్రమంలో భాగంగా జన్నారం మండల కేంద్రములో రాస్తా రోకో నిర్వహించారు . ఈ సందర్భంగా బీ సీ కులాల ఉద్యమ పోరాట సంఘం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కన్వీనర్ కోడూరి చంద్రయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వం గత రెండు సంవత్సరాలుగా రాష్ట్రంలో కుల గణన చేపట్టడమూ అసెంబ్లీలో బీ సీ బిల్లు ప్రవేశపెట్టే ఆమోదించడమూ గవర్నర్ కి బిల్లును పంపించడం, చివరికి జీ ఓ నెంబర్ 9 నీ విడుదల చేశారన్నారు. ఈ విషయంగా రెడ్డి జాగృతి సంఘం తరఫున హైకోర్టులో కేసు వేయడం వలన స్టే విధించడం జరిగిందన్నారు. దీంతో స్థానిక సంస్థల ఎన్నికలు నిలిచిపోయినాయనీ స్టే వేకేట్ చేసి 42 శాతం బీ సీ రిజర్వేషన్లతో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో బీసీ సంఘాల ఆధ్వర్యంలో రహదారులు దిగ్బంధం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీసీ కులాల ఉద్యమ పోరాట సంఘం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కో కన్వీనర్ కడార్ల నరసయ్య, మంచిర్యాల జిల్లా కన్వీనర్ ఆడేపు లక్ష్మీనారాయణ , జన్నారం మండల బీసీ సంఘం అధ్యక్షుడు గూడ అశోక్ , మాజీ ఎంపిటిసి రాగుల శంకర్ , ప్రధాన కార్యదర్శి సంద గోపాల్ , మామిడి విజయ్ , ముదిరాజ్ సంఘం మండల ఉపాధ్యక్షుడు ఐలవేణి రవి , మహేంద్ర సంఘం నాయకుడు పిల్లి మల్లయ్య, కోడి జుట్టు రాజయ్య , ఒడిపెల్లి రామన్న, ఒడిపెల్లి రాజేష్ , ఖానాపూర్ నియోజకవర్గ కో కన్వీనర్ ఆండ్ర పురుషోత్తం, పూసల సంఘం మాజీ అధ్యక్షుడు గుడ్ల రాజన్న , మంచిర్యాల జిల్లా కో కన్వీనర్ బాలసాని శ్రీనివాస్ గౌడ్ , మున్నూరు కాపు సంఘం పొనకల్ పట్టణ ఉపాధ్యక్షుడు దాసరి శ్రీనివాస్, ముంజంపెల్లి సాయి, కనికరపు గంగాధర్, గడ్డం సత్తయ్య, ఈర్ల రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :