ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. మధు వ్యాఖ్యలతో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. అసెంబ్లీలో మంత్రి సీతక్క ప్రసంగిస్తుండగ ఒక్కసారిగాభావోద్వేగానికి గురై కన్నీళ్ళ పర్యవంతమయ్యారు . అటు సీతక్క సైతం కన్నీరు పెట్టుకున్నారు. ప్రసాద్ కుమార్ తల్లిని కించపరుస్తూ వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ మధుపై కఠిన చర్యలు తీసుకోవాలని సీతక్క ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. అయితే, స్పీకర్‌పై తాతా మధు అనుచిత వ్యాఖ్యలు చేసిన వీడియోను సీఎంవో విడుదల చేసింది. ఈ క్రమంలోనే తాతా మధుపై చర్యలకు శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. సభ నుంచి తాతా మధును బహిష్కరించే యోచనలో చైర్మన్ ఉన్నారు.
Admin
E Nivas News