ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పై బీ.ఆర్.ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్ ఆధ్వర్యంలో శుక్రవారం కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్ మాట్లాడుతూ రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న అసెంబ్లీ స్పీకర్ గౌరవాన్ని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేయడన్ని తీవ్రంగాఖండించాల్సిన విషయమని అన్నారు.ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజ్యాంగబద్ధ పదవులకు గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత ప్రతి ప్రజాప్రతినిధిపై ఉందని పేర్కొన్నారు. ప్రజా ప్రతినిధులు తమ హోదాకు తగిన విధంగాబాధ్యతాయుతమైన భాషను ఉపయోగించాలని, రాజకీయ విభేదాల పేరుతో రాజ్యాంగబద్ధ పదవులను అవమానించడం సరికాదని అన్నారు. ఈ కార్యక్రమంలో జైనూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ కూడ్మేత విశ్వనాథ్ రావు, జైనూర్ సిర్పూర్ యూ మండలాల అధ్యక్షులు షైక్ రషీద్,ఆత్రం శంకర్ , కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి షైక్ అబ్దుల్ ముఖిద్ ,కొమురంభీం జిల్లా కార్యవర్గ సభ్యులు సుద్దాల శ్రీనివాస్ , పెందోర్ ప్రకాష్ ,సర్పంచ్ లు రాజేందర్ , మనోహర్,మాజీ ఎంపీటీసీ హైమద్ ఖాన్ , మాజీ వైస్ ఎంపీపీపీ చిర్లే లక్ష్మణ్ ,డుక్రే శుభాష్ ,కొట్నాక దౌలత్ , మరియు యూత్ కాంగ్రెస్ జిల్లా నాయకులు సుద్దాల ఆనంద్ ,వాసిమ్ ,కోవా సిద్దు ,మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News