ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : గత మూడు రోజులుగాఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు నెరడిగొండ మండల కేంద్రానికి చెందిన మొహమ్మద్ మరియు ఈశ్వరి బాయి ఇండ్లు కూలిపోవడంతో బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ తక్షణమే గురువారం ఇండ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా తక్షణ ఆర్థిక సహాయం అందజేశారు. భారీ వర్షాల కారణంగా ఇండ్లు కోల్పోయిన వారి జాబితాను సిద్ధం చేయాలని నష్టపరిహారం కొరకు నివేదికఅందజేయాలనిఅధికారులుఎమ్మార్వో, ఎంపిడివోలను ఆదేశించారు. మండలంలో ఎక్కడ ఎవరికి నష్టం కలిగిన వెంటనే సమాచారం అందించాలని సూచించారు. వీరి వెంట స్థానిక సర్పంచ్ నీలిమ రవీందర్ రెడ్డి, ఉప సర్పంచ్ గులాబ్, మాజీ ఎంపీపీ రాథోడ్ సజన్, మాజీ జడ్పీటీసీ పండరీ, నాయకులు సాబ్లే సంతోష్, రాథోడ్ సురేందర్, సుజీల్, ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News