ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : వరి ధాన్యాన్ని త్వరగా కొనుగోలు చేసేందుకు చర్యలు చేపట్టాలని మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ సాగర్ రావు సూచించారు. మంచిర్యాల జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలోని ఐడిఒసి సమావేశ మందిరం లో మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తో కలిసి ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు వడ్ల కొనుగోలు గురించి వ్యవసాయ శాఖ అధికారులతో, ఎమ్మార్వో తో, రైస్ మిల్ల యజమానులతో , లారీ అసోసియేషన్లతో, ఐకేపీ సభ్యులతో శనివారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు మాట్లాడుతూ వడ్ల సెంటర్ కేంద్రంలో ఉన్న తడి వడ్లను కూడా అతి త్వరగా కొనుగోలు చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు.ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు పి. చంద్రయ్య , జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి. రాములు, ఆర్డీవో శ్రీనివాస్ రావు, మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్, డిప్యూటీ మేయర్ సల్ల రమ్య-మహేష్ పాల్గొన్నారు.
Admin
E Nivas News