Tuesday, 15 September 2026 09:12:16 AM
# మహిళల నాయకత్వాన్ని బలపరచండి... మాదిగ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు నందిని # నీటి సంఘం అధ్యక్షులు తిమ్మారెడ్డి కృషితో మద్దూరు కుంటకు కేసీ.కెనాల్ జలాలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ఆశీర్వదించండి...! ఆత్మకూరు సింగల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దిన్ # పాములపాడులో ఘనంగా కామ్రేడ్ సీతారాం ఏచూరి రెండవ వర్ధంతి # ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి పి ఆర్ టి యు నంద్యాల జిల్లా శాఖ ప్రాతినిధ్యం # కార్మికుడి ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు... సింగరేణి భద్రతా ప్రమాణాలపై ఎంపీ హెచ్చరిక... # ప్రముఖ కవి సుద్దాల అశోక్ తేజకు ప్రతిష్టాత్మక సాహిత్య పురస్కారానికి ఎంపిక.. # ఫ్రీ బస్సు వద్దని మహిళల రాస్తారోకో.. # ఆర్థిక ఇబ్బందులతో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు జగన్ ఆత్మహత్య... # దసరా నుంచి లబ్ధిదారులకుకొత్త పింఛన్లు పంపిణీ... # శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్..

పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం

Date : 30 July 2026 08:06 AM Views : 115

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : మంథని పట్టణంలోని కన్యకా పరమేశ్వరి ఫంక్షన్ హాల్‌లో జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల ఆధ్వర్యంలో పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు బుధవారం సన్మాన కార్యక్రమం నిర్వహించారు. సహచర ఉపాధ్యాయులు, విద్యార్థినులు, పూర్వ విద్యార్థులు, కుటుంబ సభ్యులు, పలువురు ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరై మధుసూదన్ దంపతులకు శాలువాలు కప్పి పూలమాలలతో ఘనంగా సత్కరించి ఆయన విద్యా సేవలను కొనియాడుతూ జ్ఞాపికలను అందజేశారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ బిరుదు మధుసూదన్ విద్యార్థులకు విద్యతో పాటు క్రమశిక్షణ, విలువలను పెంపొందించడంలో విశేష కృషి చేశారని పేర్కొన్నారు. ఎన్నో సంవత్సరాల పాటు ప్రభుత్వ పాఠశాలలో సేవలందించి వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేసిన ఆదర్శ ఉపాధ్యాయుడిగా గుర్తింపు పొందారని కొనియాడారు. విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి గురువుకు కృతజ్ఞతలు తెలిపారు. పలువురు పూర్వ విద్యార్థులు తమ విద్యాభ్యాసంలో మధుసూదన్ అందించిన మార్గదర్శకత్వాన్ని గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు. అనంతరం మధుసూదన్ మాట్లాడుతూ తన సేవాకాలంలో సహకరించిన విద్యాశాఖ అధికారులు, సహచర ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు. జీవితాంతం విద్యార్థులతో అనుబంధాన్ని కొనసాగిస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టిపిసిసి ఉపాధ్యక్షుడు దుద్దిల శ్రీనుబాబు, మున్సిపల్ ఛైర్మన్ వోడ్నాల శ్రీనివాస్, వైస్ చైర్మన్ సాహెందర్ రెడ్డి, ఎంఈఓ డి. లక్ష్మి, విశ్రాంత ఉపాధ్యాయులు సుధాకర్ రెడ్డి, మోహన్ శర్మ, ఉపాధ్యాయుల సంఘాల జిల్లా, మండల నాయకులు, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సుమలతతో పాటు సహచర ఉపాధ్యాయులు, బంధువులు, స్నేహితులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: