ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు స్వగృహములో ఆదివారం తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క ను కొమరం భీమ్ ఆసిఫాబాద్ మాజీ మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, మాజీ డిసిసి అధ్యక్షులు కొక్కిరాల విశ్వ ప్రసాదరావులు సన్మానించారు. అనంతరం వారు ఆసిఫాబాద్ నియోజకవర్గం లోనిసాగు నీటి ప్రాజెక్ట్ ల మరమ్మత్తులు, కాలువలు పూర్తిచేయాలనీఅసంపూర్తి బ్రిడ్జి లను పూర్తి చేయాలనీ, మారుమూల గ్రామాలకు బీటి రోడ్లు, బ్రిడ్జిలు మంజూరు చేయాలనీ,నూతనంగా ఏర్పడిన ఆసిఫాబాద్ మున్సిపాలిటీ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలనీ, సింగరేణి ప్రభావిత గ్రామాల అభివృద్ధికి డి ఎం ఎఫ్ టి, సి ఎస్ ఆర్ నిధులు మంజూరు చేయాలనీ, ఆసిఫాబాద్ నియోజకవర్గము లోని 242 గ్రామ పంచాయతీల గ్రామాల మౌళిక వసతుల కొరకు ఎస్ డి ఎఫ్ నిధులు మంజూరు చేయాలనీ, ఉషగాం లో నివసిస్తున్న హోజా తెగ వారికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలనీ, గ్రామ పంచాయతీల పెండింగ్ బిల్లులు విడుదల చేయాలనీ నూతనంగా విధ్యుత్ సబ్ స్టేషన్ లు మంజూరు చేయాలని వినతి పత్రంలో పేర్కొన్నారు.
Admin
E Nivas News