Wednesday, 16 September 2026 03:24:07 AM
# కే.సి.కెనాల్ లో ప్రమాదవశాత్తుపడి పదో తరగతి విద్యార్థి మేకల లింగస్వామి మృతి # వినాయక నిమజ్జన ఘాట్‌లను పరిశీలించిన జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ ఐపీఎస్ # ఆగా ఖాన్ ఫౌండేషన్ ద్వారా సహకారం అందించాలి... సీఎం రేవంత్ రెడ్డి # సామూహిక దీక్షలో ఉద్యోగులు పాల్గొని విజయవంతం చేయాలి # ఏపీ మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని మృతి పట్ల మంత్రి పొన్నం ప్రభాకర్ సంతాపం.. # చెన్నూర్ ను ఆధునిక పట్టణంగా తీర్చిదిద్దడమే లక్ష్యం.. # మహిళల నాయకత్వాన్ని బలపరచండి... మాదిగ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు నందిని # నీటి సంఘం అధ్యక్షులు తిమ్మారెడ్డి కృషితో మద్దూరు కుంటకు కేసీ.కెనాల్ జలాలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ఆశీర్వదించండి...! ఆత్మకూరు సింగల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దిన్ # పాములపాడులో ఘనంగా కామ్రేడ్ సీతారాం ఏచూరి రెండవ వర్ధంతి # ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి పి ఆర్ టి యు నంద్యాల జిల్లా శాఖ ప్రాతినిధ్యం # కార్మికుడి ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు... సింగరేణి భద్రతా ప్రమాణాలపై ఎంపీ హెచ్చరిక... # ప్రముఖ కవి సుద్దాల అశోక్ తేజకు ప్రతిష్టాత్మక సాహిత్య పురస్కారానికి ఎంపిక.. # ఫ్రీ బస్సు వద్దని మహిళల రాస్తారోకో.. # ఆర్థిక ఇబ్బందులతో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు జగన్ ఆత్మహత్య... # దసరా నుంచి లబ్ధిదారులకుకొత్త పింఛన్లు పంపిణీ... # శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్...

2034 వరకు సీఎంగా నేనే ఉంటా...

సీఎం రేవంత్ రెడ్డి

Date : 30 July 2026 09:19 PM Views : 78

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : 2034 వరకు నేనే సీఎం గా ఉంటానని ఆ విషయంలో అనుమానం వద్దని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. గురువారం ఫిన్లాండ్, జర్మనీ టీచర్ ఎక్స్ఛేంజ్ సమావేశానికి హాజరైన ఉపాధ్యాయులతో సమావేశమై మాట్లాడారు. ఈ సందర్భంగా సీఎం పలు కీలక వ్యాఖ్యలు చేశారు. విమర్శలు చేసేవారు చేస్తూనే ఉంటారని వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. విద్య కోసం ఎంత ఖర్చు చేసేందుకైనా సిద్ధమని స్పష్టం చేశారు.విద్యాభివృద్ధికి ఏం కావాలి అనే అంశంపై ఉపాధ్యాయులు సూచనలు, సలహాలు ఇవ్వాలని ఆయన సూచించారు. సమాజంవెనుకబాటుతనానికి మూల కారణం నిరక్షరాస్యతేనని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. వెనకబాటుతనానికి కారణం చదువుకోకపోవడమే అన్నారు. విద్యలో మరింత నాణ్యత పెరగాల్సిన అవసరం ఉందన్న ఆయన విద్యార్థులకు పౌష్ఠకాహారాన్ని అందించాలని అధికారులను ఆదేశించారు. విద్యాశాఖలో కె కేశవరావు అనేక సూచనలుచేస్తున్నారని తెలిపారు. వెనుకబాటుతనానికి కారణంచదువుకోకపోవడమేనని, అందుకే విద్యలో నాణ్యత పెరిగేలా తమ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్లు రేవంత్ రెడ్డి వివరించారు. ప్రభుత్వ బడుల్లో చదివితే ఉద్యోగం వస్తుందనే నమ్మకాన్ని విద్యార్థులకు కల్పించాలని అధికారులను రేవంత్ రెడ్డి ఆదేశించారు. నేను విద్యాశాఖకు ఎందుకు రాజీనామా చేయాలి? పిల్లలకు అల్పాహారం అందించినందుకు రాజీనామా చేయాలా, ఐటీఐలను కాకుండా ఏటీసీలు ఏర్పాటు చేసినందుకు రాజీనామా చేయాలా అని ప్రశ్నించారు. పిల్లల భవిష్యత్ కోసమే విద్యాశాఖ తీసుకున్నాను అన్నారు. విదేశాల్లో ఉన్న నాణ్యమైన విద్యావిధానాన్ని టీచర్లకు నేర్పించేందుకు ఏడాదికి 10 నుంచి 12 మంది ఉపాధ్యాయులను విదేశాలకు పంపిస్తామన్నారు. ఒక ఏడాది లీవ్, చదువుకు అవసరమైన ఫండ్ ఇస్తామన్నారు. ప్రభుత్వ కళాశాలలో చదివితే ఉద్యోగం వస్తుందనే నమ్మకం విద్యార్థులకుకల్పించాలని సూచించారు. రెవెన్యూ, ఆర్థిక, నీటిపారుదలశాఖలు తాను తీసుకోలేదని, పిల్లల భవిష్యత్ కోసమే విద్యాశాఖ చేపట్టినట్లుగా వివరించారు. ఉపాధ్యాయులంతా ఎవరికి ఇమ్మంటే వాళ్లకు విద్యాశాఖ బాధ్యతలను ఇచ్చేస్తానన్నారు. ఓట్లు తెచ్చేవి విద్యాశాఖలో ఏముంటాయన్న ఆయన నర్సరీ చదివే పిల్లవాడు తనకు ఓటేస్తాడా అని సరదాగా వ్యాఖ్యనించారు. తాను ప్రభుత్వ బడిలోనే చదువుకున్నానని రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని ఏమవుతావని అడిగారని, తాను సీఎం అవుతానని చెప్పానని అన్నారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కార బాధ్యతలను నేనే తీసుకుంటానన్నారు. పిల్లల సమస్యలపై ఉపాధ్యాయసంఘాలు నాతో కొట్లాడాలని ముఖ్యమంత్రి కోరారు. ఐఏఎస్ లను బదిలీ చేయడం చాలా తేలిక, ఉపాధ్యాయులను బదిలీ చేయడం మాత్రం అంత సులభం కాదన్నారు. దేశానికి విద్య, వైద్యంలో నాయకత్వాన్ని తెలంగాణ నుంచి ఎందుకు ఇవ్వలేం. మీ మండలంలో ఉన్న ప్రతి పిల్లవాడు ప్రభుత్వ పాఠశాలకు రావాలి. మీ మండలానికి ఏం కావాలో ఉపాధ్యాయులు చెప్పాలన్నారు. పైనుంచి కాదు కింద నుంచి ఆదేశాలు రావాలన్నారు. మండలాల్లో విద్యాభివృద్ధికి ఏం కావాలో ఉపాధ్యాయులు సలహాలు, సూచనలు ఇవ్వండి. టీచర్ల సలహాలను తీసుకుని అధికారులు అమలు చేస్తారు అని సీఎం వివరించారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: