Monday, 14 September 2026 09:00:32 AM
# మహిళల నాయకత్వాన్ని బలపరచండి... మాదిగ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు నందిని # నీటి సంఘం అధ్యక్షులు తిమ్మారెడ్డి కృషితో మద్దూరు కుంటకు కేసీ.కెనాల్ జలాలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ఆశీర్వదించండి...! ఆత్మకూరు సింగల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దిన్ # పాములపాడులో ఘనంగా కామ్రేడ్ సీతారాం ఏచూరి రెండవ వర్ధంతి # ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి పి ఆర్ టి యు నంద్యాల జిల్లా శాఖ ప్రాతినిధ్యం # కార్మికుడి ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు... సింగరేణి భద్రతా ప్రమాణాలపై ఎంపీ హెచ్చరిక... # ప్రముఖ కవి సుద్దాల అశోక్ తేజకు ప్రతిష్టాత్మక సాహిత్య పురస్కారానికి ఎంపిక.. # ఫ్రీ బస్సు వద్దని మహిళల రాస్తారోకో.. # ఆర్థిక ఇబ్బందులతో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు జగన్ ఆత్మహత్య... # దసరా నుంచి లబ్ధిదారులకుకొత్త పింఛన్లు పంపిణీ... # శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్..

సంసద్ సభ్యుల వేతనాలు–భత్యాలపై సంయుక్త కమిటీ సమావేశంలో పాల్గొన్న పెద్దపల్లి ఎంపీ

Date : 24 January 2026 07:50 PM Views : 239

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : బెంగళూరు లోదేశవ్యాప్తంగా సంసద్ సభ్యుల వేతనాలు, భత్యాలు, పని పరిస్థితులపై సమగ్ర అధ్యయనం చేసేందుకు ఏర్పాటు చేసినసంయుక్త కమిటీ సమావేశం శనివారం బెంగళూరులో ఘనంగా జరిగింది. ఈ సమావేశంలో పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ పాల్గొన్నారు. సమావేశంలో ఎంపీ వంశీకృష్ణ మాట్లాడుతూ ప్రజా ప్రతినిధులపై రోజురోజుకుపెరుగుతున్ బాధ్యతలు, క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలు, ప్రజలకు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండాల్సిన అవసరం వంటి కీలక అంశాలను కమిటీ దృష్టికి తీసుకువచ్చారు. ప్రజల గొంతుకగా పార్లమెంట్‌లో నిరంతరం పనిచేస్తున్న ఎంపీల దృష్ట్యా, వేతనాలు, భత్యాల వ్యవస్థను మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా రూపొందించాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు. అదే సందర్భంగా, తెలంగాణలో అతిపెద్ద పండుగ అయిన రాబోయే సమ్మక్క–సారలమ్మ జాతర నేపథ్యంలో పెద్దపల్లి మీదుగా అదనపు రైళ్లను ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉందని, అలాగే రైల్వేకు సంబంధించిన పెండింగ్‌లో ఉన్న నిర్మాణ పనులు, ఇతర సమస్యలను అత్యంత సీరియస్‌గా పరిగణించి తక్షణమే పూర్తి చేయాల్సిన అవసరం ఉందని ఎంపీ వంశీకృష్ణ కమిటీ దృష్టికి తీసుకువచ్చారు. ఈ పెండింగ్ సమస్యల వల్ల స్థానిక ప్రయాణికులు, కార్మికులు తీవ్రఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన వివరించారు. గ్రామీణ–పారిశ్రామిక ప్రాంతాలైన పెద్దపల్లి నియోజకవర్గంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రత్యక్షంగా అనుభవిస్తున్న ఎంపీగా వంశీకృష్ణ చేసిన సూచనలు కమిటీ సభ్యులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఆయన ప్రస్తావించిన అంశాలను పరిగణలోకి తీసుకుంటామని కమిటీ సభ్యులు హామీఇచ్చారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :